సోషల్ మీడియాపై మోడీ కీలక నిర్ఱయం.. రాహుల్ సెటైర్లు
03-03-202003-03-2020 08:58:42 IST
Updated On 03-03-2020 08:58:39 ISTUpdated On 03-03-20202020-03-03T03:28:42.626Z03-03-2020 2020-03-03T03:21:59.472Z - 2020-03-03T03:28:39.866Z - 03-03-2020

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రెండవసారి ఎన్నికయ్యాక ఆయన ఫాలోయింగ్ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో నిత్యం ఆయన చాలా యాక్టివ్ గా వుంటారు. అయితే అకస్మాత్తుగా మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు, ఆదివారం నుంచి సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండేందుకు ప్రధానమంత్రి మోదీ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సోమవారం వెల్లడించారు. ‘ఈ ఆదివారం నుంచి ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నా’ అని సోమవారం ఆయన సంచలన ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ రాజకీయంగా ప్రకంపలను కలిగిస్తోంది. అయితే సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. సంబంధిత వర్గాలను సంప్రదించగా, భవిష్యత్ ప్రణాళిక త్వరలో వెల్లడించే అవకాశముందని తెలిపాయి. మోదీ తాజా నిర్ణయం సంచలనాత్మకంగా మారింది. ఈ ట్వీట్ గంటలో 30వేల సార్లు రీట్వీట్ అయింది. క్షణక్షణానికో కామెంట్ వచ్చిపడింది.
మోడీ అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయని అనుకోవడానికి వీల్లేదు. చాలా పకడ్బందీగా ఆయన అకౌంట్లను రక్షిస్తున్నారు సోషల్ మీడియా టీం. ప్రధాని నిర్ణయంపై ట్వీట్లు వచ్చిపడుతున్నాయి. సోషల్ మీడియా కేంద్రంగా ’నో సర్’ అని వేలాదిగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ‘నో సర్’ ట్రెండవుతున్న హ్యాష్ట్యాగ్గా మారింది. ‘ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులున్నారు. కావాలంటే చిన్న బ్రేక్ తీసుకోండి. కానీ పూర్తిగా వదిలేయవద్దు’ అంటున్నారు. మరోవైపు మోడీ నిర్ణయంపై విపక్షాలు తమదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి.


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయితే మీరు వదలాల్సింది సోషల్ మీడియాను కాదు.. విద్వేషాన్ని అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు. ‘మీరు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కాదు.. వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసే, బెదిరించే, హెచ్చరించే మీ ఆర్మీకి ఈ సలహా ఇవ్వండి– ఇట్లు భారత పౌరులు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జెవాలా వ్యంగ్యంగా ట్వీట్ చేయడం ట్రెండింగ్ అవుతోంది.


ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో మోదీ ఫాలోయింగ్ మామూలుగా లేదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ట్విటర్లో మోదీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోదీనే. ఫేస్బుక్లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు.
ప్రధాని కార్యాలయ ట్వీటర్ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తుంటారు. సెప్టెంబర్ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు. ఈ నేపథ్యంలో మోడీ తీసుకున్న నిర్ణయం ఆయన సోషల్ మీడియా అభిమానులను షాకింగ్ కి గురిచేస్తోంది.





సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా