newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సోనియా గాంధీనే టార్గెట్ చేస్తూ మరో ఘాటులేఖ..

08-09-202008-09-2020 15:57:17 IST
2020-09-08T10:27:17.818Z08-09-2020 2020-09-08T10:27:15.100Z - - 10-04-2021

సోనియా గాంధీనే టార్గెట్ చేస్తూ మరో ఘాటులేఖ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దయచేసి కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించండి. పార్టీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలను పునరుద్ధరించండి. పరస్పర విశ్వాసాలను పార్టీలో పెంచండి అంటూ యూపీ కాంగ్రెస్ బహిష్కృత నేతలు పార్టీ మధ్యంతర అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన తాజా లేఖలో పేర్కొన్నారు.

క్రియాశీలక, పూర్తి కాలపు నాయకుడు కావాలంటూ 23 మంది సీనియర్లు లేఖ రాసి కాక పుట్టించిన కొన్ని రోజులకే బహిష్కృత నేతలు మరో లేఖ రాసి కాక పుట్టిస్తున్నారు. యూపీ కాంగ్రెస్ బహిష్కృత నేతలు ఈసారి నేరుగా సోనియా గాంధీనే టార్గెట్ చేస్తూ లేఖ రాశారు. ‘‘కుటుంబ అనుబంధాలను దాటి ఆలోచించండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ కాంగ్రెస్‌లో కాక పుట్టినట్లైంది.

Rise above family: Another letter 'bomb' to Congress interim chief Sonia  Gandhi, this time from 9 expelled leaders | India News | Zee News

మీ బాధ్యతల నుంచి మీరు పక్కకు తప్పుకుంటే ఇకపై కాంగ్రెస్ గతించిన విషయమే అవుతుందని బహిష్కృత నేతలు వ్యాఖ్యానించారు. ఈరోజు కాంగ్రెస్ అనిశ్చితికి, నిర్ణయ రాహిత్యానికి, వ్యక్తీకరణ లేమికి, ఆలోచనలు పంచుకోలేని స్థితికి చేరుకుందని, ఒక్కమాటలో చెప్పాలంటే పార్టీ మొత్తంగా ఉనికికి సంబంథించిన సంక్షోభంలో పయనిస్తోందని వీరన్నారు. 

నెహ్రూ, ఇందిర, రాజీవ్ కాంగ్రెస్‌ను నిర్మించారు. దేశంలో ప్రజాస్వామ్య పునాదులు కూడా వేశారు. కానీ కొంత కాలంగా పార్టీని నడుపుతున్న విధానాన్ని చూస్తుంటే సాధారణ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని, నిరాశను కలిగిస్తోంది అంటూ బహిష్కృత నేతలైన సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి లేఖలో పేర్కొన్నారు.

దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక విలువలు తగ్గిపోతున్న ఇలాంటి సమయంలో దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందని, కాంగ్రెస్ సజీవంగా, ధృఢంగా ఉండాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

బహిరంగ వేదికలలో పార్టీని తూలనాడటం, పార్టీపై విమర్శలు చేయడం, పార్టీ ఇమేజ్‌ను దెబ్బ తీయడం లాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ యూపీకి చెందిన పది మంది నేతలను అధిష్ఠానం బహిష్కరించింది. ఆ పది మందిలో సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి నేతలు కూడా ఉన్నారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle