సోనియా కంటే రాహులే బెస్టా.. తాజా సర్వే ఏం చెబుతోంది?
28-01-202028-01-2020 09:04:57 IST
Updated On 28-01-2020 11:12:30 ISTUpdated On 28-01-20202020-01-28T03:34:57.341Z28-01-2020 2020-01-28T03:34:39.896Z - 2020-01-28T05:42:30.291Z - 28-01-2020

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన అస్థిత్వాన్ని కోల్పోతోంది. అడపా దడపా కాంగ్రెస్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది కాంగ్రెస్. ప్రస్తుతం ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల గురించి. రాహుల్ గాంధీ పాపులారిటీ గురించి సర్వే జరిగింది. ఈ సర్వే ఫలితాలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. పాపులారిటీ సంపాదించుకునే విషయంలో రాహుల్ గాంధీ ముందున్నారని ఐఏఎన్ఎస్ - సీ ఓటర్ రిపపబ్లిక్ డే 'స్టేట్ ఆఫ్ నేషన్' సర్వేలో ఈ విషయం తేలింది.దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న పాపులారిటీ విషయంలో తల్లి సోనియా గాంధీ కన్నా రాహుల్ గాంధీ ముందుండడం విశేషం. తాజాగా జరిగిన 'స్టేట్ ఆఫ్ నేషన్' సర్వేలో సోనియాగాంధీకి 49.5 శాతం మంది, రాహుల్ గాంధీకి 51.9 శాతం మంది మద్దతుగా నిలిచారు. దేశంలోని మొత్తం 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు.. మొత్తం 30,240 మంది నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. హరియాణాలో రాహుల్ పనితీరుపట్ల కేవలం 17.7 శాతం మంది సంతృప్తిగా ఉండగా, కేరళలో 51.9 శాతం, పుదుచ్చేరిలో అత్యధికంగా 76 శాతం రాహుల్ కు అనుకూలంగా ఉన్నారని సర్వే పేర్కొంది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ సంతృప్తికరంగా పని చేశారని 49.5శాతం మంది అభిప్రాయపడ్డారు. అందులో తెలంగాణాలో 50.5శాతం మంది, కేరళలో 43.3శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 37.9శాతం మంది ఆమె పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 14.5శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆశించిన సీట్లు రావని, 4-5 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఇటు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ ప్రతిష్ట పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా