newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సోనియాకే అన్ని అధికారాలు...గులాం నబీ ఆజాద్ గుస్సా

24-08-202024-08-2020 20:00:06 IST
Updated On 25-08-2020 08:20:15 ISTUpdated On 25-08-20202020-08-24T14:30:06.290Z24-08-2020 2020-08-24T14:29:56.792Z - 2020-08-25T02:50:15.987Z - 25-08-2020

సోనియాకే అన్ని అధికారాలు...గులాం నబీ ఆజాద్ గుస్సా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకూ అధ్యక్ష పదవిలో కొనసాగాలని సోనియాను తాము కోరామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని నెలలపాటు పార్టీ తాత్కాలిక చీఫ్‌గా ఆమె కొనసాగుతారని పేర్కొన్నాయి. ఆరు నెలల్లో తదుపరి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని తెలిపాయి. ఇవాళ జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలనీ కోరుతూ 23మంది కాంగ్రెస్ సీనియర్లు సోనియాగాంధీకి లేఖ రాశారు.. అయితే ఈ లేఖ పైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడివేడిగానే చర్చ సాగింది.

ఈ లేఖను ప్రాస్తావిస్తూ.. రాహుల్ గాంధీ సీనియర్ల పై మండిపడ్డ సంగతి తెలిసిందే. బీజేపీతో కుమ్మక్కై సోనియాకు లేఖ రాశారా అని సీనియర్లని నిలదీశారు రాహుల్.. సోనియా ఆస్పత్రిలో చేరిన సమయంలో లేఖ ఎలా రాస్తారని అయన ప్రశ్నించారు. ఆ లేఖ తన తల్లిని తీవ్రంగా బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఈ వాఖ్యలు కొందరు లీడర్లను నొప్పించాయని తెలుస్తోంది.

ఆ పార్టీ సీనియర్ లీడర్ గులాంనబీ అజాద్ రాహుల్ తీరుపై తీవ్రంగా స్పందించారు.. బీజేపీతో కుమ్మక్కై సోనియాకు లేఖ రాశామని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని అయన అన్నారు.. ఇక మరో సీనియర్ నేత కపిల్‌ సిబల్‌ ఇదే అంశం పైన ట్విటర్‌ వేదికగా స్పందించారు. గడిచిన 30ఏళ్లలో ఏరోజూ బీజేపీకి అనుకూలంగా ఏ విషయంలోనూ మాట్లాడలేదని అన్నారు. రాజస్థాన్‌లో కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ పక్షానే నిలిచామని అలాంటి తమపై రాహుల్ చేసిన కామెంట్లు బాధించాయన్నారు. 

30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. అంతకుముందు సోనియా గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగలేనని, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె స్పష్టం చేశారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు రాహుల్ గాంధీ కూడా విముఖంగా ఉండడంతో ఇక పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరవుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle