newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

సొంత నేతలతోనే ఆమ్ ఆద్మీకి తలనొప్పులు

06-05-201906-05-2019 07:49:50 IST
2019-05-06T02:19:50.800Z06-05-2019 2019-05-06T02:12:51.943Z - - 26-08-2019

సొంత నేతలతోనే ఆమ్ ఆద్మీకి తలనొప్పులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల వేళ ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. పంజాబ్ ఆప్ పార్టీ నుంచి భారీగా బీజేపీలోకి పెరిగిన వ‌ల‌స‌ల‌తో కంగుతిన్న కేజ్రీవాల్ టీంకు, గ‌త మార్చిలో ఆప్ ఎంపీ హ‌రీంద‌ర్ సింగ్ ఖ‌ల్సా కూడా బీజేపీలో చేర‌డంతో విస్తుపోయింది. ఇది పంజాబ్ ఆప్ ప‌రిస్థితి అయితే, ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 

మే 3వ తేదీన ఆప్ ఎంఎల్ఏ, గ‌త ఎన్నిక‌ల్లో గాంధీన‌గ‌ర్ అసెంబ్లీసీటు నుంచి గెలిచిన అనీల్ బాజ్ పాయ్ బీజేపీలో చేరారు. కేజ్రీవాల్ తీరుతో తాను విసిగిపోయాన‌నీ, పార్టీలో తీవ్ర‌మైన అవ‌మానాలు భ‌రించ‌లేకే బీజేపీలో చేరిన‌ట్లు అనీల్ ప్ర‌క‌టించారు. గ‌తంలో పంబాజ్ ఎంపీ ఖ‌ల్సా కూడా ఇవే ఆరోప‌ణ‌లు చేశారు. 

ఇక అనీల్ బాజ్ పాయ్ పార్టీని వీడ‌టంతో చిక్కుల్లో ప‌డ్డ ఆప్ నేత‌లు, బీజేపీ మీద మాట‌ల యుద్దం మొద‌లు పెట్టారు. త‌మ ఎంఎల్ఏల‌ను బీజేపీ కొనుగోలు చేస్తోంద‌నీ, ఒక్కొక్క ఎంఎల్ఏకి దాదాపు 10 కోట్ల రూపాయలు బీజేపీ నేత‌లు ఇస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు. అనీల్ బాజ్ పాయ్‌తో పాటు మ‌రో 14 మంది త‌మ పార్టీ నేత‌లు బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన అనీల్, ఈ ఎన్నిక‌ల్లో హ‌స్తం పార్టీతో త‌మ‌కు పొత్తు లేక‌పోవ‌డం వ‌ల్లే బీజేపీలో చేరిన‌ట్లు చెబుతున్నారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను ఢిల్లీ బీజేపీ నేత‌లు కొట్టిపారేస్తున్నారు. త‌మ‌తో ట‌చ్ లో ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతున్న 14 మంది ఎంఎల్ఏల‌లో క‌నీసం ఏడుగురి పేర్లు బ‌హిర్గతం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

పార్టీ వీడుతున్నార‌ని తెల్సిన కేజ్రీవాల్ టీం, ఆ 14 మంది ఎంఎల్ఏలను ఎందుకు క‌ట్ట‌డి చేయ‌లేక పోతున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు అనీల్ బాజ్ పాయ్ పార్టీని వీడ‌టం స‌రైన నిర్ణ‌య‌మే అంటున్నారు చాందినీ చౌక్ ఎంఎల్ఏ, ఆప్ నేత అల్కా లంబా. అనీల్ బాజ్ పాయ్ వ‌య‌సుకు, అనుభ‌వానికి మ‌ర్యాద ఇవ్వ‌కుండా చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న ప‌ట్ల అమ‌ర్యాదగా కేజ్రీవాల్ టీం ప్ర‌వ‌ర్తించింద‌ని ఆమె ఆరోపించారు. 

పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో ఎంఎల్ఏల‌ను కోతులు, గాడిద‌లు, ప‌నికిమాలిన వాళ్లు అంటూ కేజ్రీవాల్ తిట్ట‌డం స‌భ్య‌త కాద‌న్నారు. మొత్తానికి ఢిల్లీలో ఒంట‌రి పోరుతో ఎన్నిక‌ల బ‌రిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి సొంత పార్టీ ఎంఎల్ఏలు గుడ్ బై కొట్ట‌డం రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle