newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సైనిక చరిత్రలో కొత్త శకం.. రఫేల్ విమానాలతో శత్రువులకు వణుకే.. రాజనాధ్ సింగ్

30-07-202030-07-2020 06:50:20 IST
2020-07-30T01:20:20.174Z30-07-2020 2020-07-30T01:20:15.944Z - - 14-04-2021

సైనిక చరిత్రలో కొత్త శకం.. రఫేల్ విమానాలతో శత్రువులకు వణుకే.. రాజనాధ్ సింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రపేల్ యుద్ధవిమానాలు బుధవారం అంబాలా వైమానిక స్థావరానికి చేరిన సందర్భంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  చైనా, పాకిస్తాన్ దేశాలను తీవ్రంగా హెచ్చరించారు. బహుళ ప్రయోజనాలు కలిగించే ఈ యుద్ధవిమానాల రాకతో భారత సైనిక చరిత్రలో కొత్త శకానికి నాందిపలికినట్లయిందని పేర్కొన్నారు. 

అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు బుధవారం అంబాలా వైమానికి స్ధావరానికి చేరిన  సందర్బంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశం పాక్‌, డ్రాగన్‌ దేశాలకు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ఆత్మవిశ్వాసం వ్యక్తపరిచిన రాజ్ నాథ్ ఈ అత్యాధునిక యుద్ధవిమానాలు భారత వాయుసేన సామర్థ్యాన్ని విప్లవీకరిస్తుందని చెప్పారు. 

పక్షులు అంబాలాలో సురక్షితంగా దిగాయి. రఫేల్ ఫైటర్‌ జెట్స్‌ రాకతో మన సైనిక చరిత్రలో కొత్త శకానికి తెర లేచింది. ఈ మల్టీరోల్ విమానాలు ఐఏఎఫ్‌ సామర్థ్యాలను విప్లవాత్మకంగా మారుస్తాయి. మనం ఈ రఫేల్ యుద్ధ విమానాలు సొంతం చేసుకోవడం చూసి ఎవరి వెన్నులోనైనా వణుకు పడుతుంది అంటే.. అది కేవలం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నుతున్న వారికే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు.

రఫేల్ ఫైటర్‌ జెట్స్ కొనుగోలుపై విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి సైతం రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్ ద్వారా బదులిచ్చారు. రఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఫ్రాన్స్ నుంచి వాటిని కొనుగోలు చేయడం జరిగిందని.. ఇప్పటికే ఈ విషయంలో ఉన్న అన్ని సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగిందని రాజ్‌నాథ్ సింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ప్రస్తుతం భారత్‌లోకి చొచ్చుకు రావాలనే కాంక్షతో రగిలిపోతోంది పాకిస్తాన్, చైనా దేశాలే. ఆ రెండు దేశాలను ఉద్దేశించే రక్షణ శాఖ మంత్రి ఈ హెచ్చరికలు చేశారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత సంవత్సరం అక్టోబర్ 18న ఫ్రాన్స్‌లో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని అధికారికంగా భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వీకరించిన తర్వాత రఫేల్ యుద్ద విమానాలు భారత్ చేరడానికి 9 నెలల సమయం తీసుకుంది. 

భారత వ్యూహాత్మక సైనిక సామర్థ్యాలకు సంబంధించనంతవరకు రఫేల్ యుద్ధవిమానాలు గేమ్ ఛేంజర్‌ పాత్రను పోషించనున్నాయని రక్షణ వర్గాల అభిప్రాయం. నేలమీది ఆకాశంలో లక్ష్యాలపై దాడి చేయడం, గగనతలాన్ని కాచుకోవడం, శత్రుదేశాల కంటే గగనంలో ఆధిక్యత సాధించడం, సమర్థంగా నిఘా నిర్వహించడం,  అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం కలిగివుండటం వంటి అనేక లక్ష్యాలను రఫేల్ యుద్దవిమానాలు నెరవేరుస్తాయి. ప్రత్యేకించి చైనా వైమానిక బలగంపై భారత్ తిరుగులేని ఆధిక్యత సాధించినట్లేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle