newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సెప్టెంబర్‌లో స్కూళ్ళా? వద్దేవద్దంటున్న పేరెంట్స్

19-08-202019-08-2020 08:39:10 IST
2020-08-19T03:09:10.477Z19-08-2020 2020-08-19T03:07:05.215Z - - 11-04-2021

సెప్టెంబర్‌లో స్కూళ్ళా? వద్దేవద్దంటున్న పేరెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈఏడాది విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. పరీక్షలు రాయకుండానే లక్షలాదిమంది పదో తరగతి పాసైపోయారు. కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలను ప్రారంభించడంపై తల్లిదండ్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వైరస్ పెరిగిపోతుండడంతో  తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. సెప్టెంబర్‌లో పాఠశాలలు తెరవాలన్న నిర్ణయంపై ఎక్కువశాతం మంది తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారు. ఆన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్‌ ఒకటి నుంచి పాఠశాలలు తెరుచుకోవచ్చని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది.

దీంతో అప్పుడు పాఠశాలలు తెరిస్తే ఎలా ఉంటుంది? ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ మంచిదేనా? అసలు పాఠశాలల పునఃప్రారంభంపై తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారనే దానిపై ఓ సంస్థ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. ఇందులో ఎక్కువ మంది కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు తెరవకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. దేశంలోని 252 జిల్లాల్లో 25 వేల మంది తల్లిదండ్రులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 63శాతం పురుషులు, 37శాతం మహిళలు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది అభిప్రాయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలంటున్నారు. 

కరోనాకు కేరాఫ్ అడ్రస్ అయిన అమెరికాలో పాఠశాలలను పునఃప్రారంభించింది. అయితే, అక్కడ భారీస్థాయిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎక్కువమంది కరోనా బారినపడ్డారు. వందలమందిని క్వారంటైన్‌కు తరలించాలి. ఏం జరుగుతుందోనన్న బెంగ తల్లిదండ్రుల్లో వుంది. ఇటు మేనెలలోనే పాఠశాలలు తెరచిన ఇజ్రాయెల్‌లోనూ కొద్దిరోజుల్లోనే విద్యార్థులు, ఉపాధ్యాయులను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఇతర దేశాల్లో పరిస్థితిని గమనించిన కెన్యా ఈ ఏడాది పాఠశాలలను పూర్తిగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మనదేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 65 వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. పదిలక్షల కేసులు స్థాయి నుంచి కేవలం 20 రోజుల వ్యవధిలో 20 లక్షలకు చేరుకున్నాయి. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం పిల్లలు హైరిస్క్‌ క్యాటగిరీలో ఉన్నారు. 

ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉన్న భారతదేశంలో పిల్లలను పాఠశాలలకు పంపిస్తే వారిద్వారా కుటుంబం మొత్తానికి వ్యాపించే ప్రమాదం వుంటుందని సర్వేల్లో తేలింది. దీంతో పాఠశాలల పేరు చెబితే అటు పిల్లలు, తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. సెప్టెబరులో పరిస్థితిని సమీక్షించాక స్కూళ్ళు తెరవడం మంచిదని తల్లిదండ్రులు అంటున్నారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle