newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సెంటిమెంట్ ర‌గిలింది... ఎన్సీపీ గ‌ట్టెక్కింది..!

25-10-201925-10-2019 08:57:59 IST
2019-10-25T03:27:59.829Z25-10-2019 2019-10-25T03:27:52.663Z - - 12-04-2021

సెంటిమెంట్ ర‌గిలింది... ఎన్సీపీ గ‌ట్టెక్కింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ చూశాక కాంగ్రెస్ - ఎన్సీపీ కూట‌మికి కోలుకోలేని దెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని అంతా అనుకున్నారు. ఎన్సీపీ చ‌రిత్ర‌లో క‌లిసి పోతుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల ముందు పెద్ద ఎత్తున నేత‌లు బీజేపీ, శివ‌సేన‌లోకి వెళ్ల‌డం, పార్టీ పెద్ద‌ల‌పై కేసులు వంటి ప‌రిణామాల‌తో ఎన్నిక‌ల ముందే ఆ పార్టీ నైరాశ్యంలోకి వెళ్లింది.

అయితే, అనూహ్యంగా పుంజుకుంది బీజేపీ - శివ‌సేన‌కు షాకిచ్చింది ఆ పార్టీ. పార్టీ అధ్య‌క్షుడు, రాజకీయ వ్యూహాలు ప‌న్న‌డంలో దిట్ట అయిన శ‌ర‌ద్ ప‌వార్ వ్యూహాల‌తో ఎన్సీపీని కాపాడుకున్నారు. సెంటిమెంట్ రాజేసి ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కారు. మ‌హారాష్ట్ర‌లో మొద‌టి సారి ఒంట‌రిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌నే బీజేపీ క‌ల‌ను చెరిపేశారు.

78 ఏళ్ల శ‌ర‌ద్ ప‌వార్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించి అర్థ శ‌తాబ్దం దాటింది. నాలుగుసార్లు ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. 38 ఏళ్ల‌కే ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చెపట్టారు. మ‌హారాష్ట్రలో ఆయ‌న‌కు మంచి ప‌ట్టుండేది. కాంగ్రెస్‌ను చీల్చి ఎన్సీపీ ఏర్పాటు చేసుకున్న‌ త‌ర్వాత కూడా ఆయ‌న బ‌లం చాటుకున్నారు. ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టాల‌నేది ఆయ‌న క‌ల‌.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు గెలిచేందుకు ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డారు. 78 ఏళ్ల వ‌య‌స్సులో 78 ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నారు. కానీ, మోడీ హ‌వాతో ఎన్సీపీ కేవ‌లం నాలుగు సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. అప్పుడే ఇక ఎన్సీపీ ప‌ని అయిపోయింద‌ని అంతా అనుకున్నారు. త‌ర్వాత కేసులు, నేత‌ల వ‌ల‌స‌ల‌తో ఆ పార్టీ మ‌రింత బ‌ల‌హీన ప‌డింది.

కానీ, శ‌రద్ ప‌వార్ మాత్రం ప‌ట్టువ‌ద‌ల‌లేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని త‌న భుజాల‌పై మోసుకున్నారు. ఏకంగా 60 ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నారు. చివ‌రి రోజు స‌తార నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న మాట్లాడుతుండ‌గా బోరున వాన కురిసింది. వేదిక మీద ఉన్న నేత‌లంతా వాన నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, ఆయ‌న మాత్రం వాన‌లోనే ప్ర‌సంగించారు.

ఎన్నిక‌ల ముందు శ‌ర‌ద్ ప‌వార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కేసు న‌మోదు చేసింది. దీనిని ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారాస్త్రంగా వాడుకున్నారు. విచార‌ణ‌కు పిల‌వ‌క‌ముందే విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు సిద్ధ‌మ‌య్యారు. బీజేపీ క‌క్ష‌పూరితంగా కేసులు పెడుతోంద‌ని ఆరోపించారు. ఓ స‌మ‌యంలో కంట‌త‌డి కూడా పెట్టారు. దీంతో ప్ర‌జ‌ల్లో ఆయ‌న ప‌ట్ల సానుభూతి పెరిగిపోయింది.

ఇక‌, శ‌ర‌ద్ ప‌వార్ అల్లుడు, ఈడీ కేసులు ఎదుర్కుంటున్న అజిత్ ప‌వార్‌కు అయితే ప్ర‌జ‌లు ఘ‌న విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. పూణె జిల్లాలోని బారామ‌తి నుంచి ఆయ‌న పోటీ చేశారు. ఎన్నిక‌ల ముందు ఆయ‌న‌పై కేసులు పెట్ట‌డంతో ప్ర‌జ‌ల్లో సానుభూతి పెల్లుబూకింది. దీంతో ఆయ‌న 1.20 ల‌క్ష‌ల భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. పోలైన ఓట్ల‌లో 80 శాతం ఆయ‌న‌కే వ‌చ్చాయి. ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రికీ డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు.

శ‌ర‌ద్ ప‌వార్ ప‌ట్టువ‌ద‌ల‌కుండా పోరాడ‌టం, ఎన్నిక‌ల ముందు కేసులు న‌మోదు కావ‌డం, బీజేపీ క‌క్ష‌పూరితంగా కేసులు పెడుతుంద‌నే సెంటిమెంట్ ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డ‌టంతో ఎన్సీపీ మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ పుంజుకుంది. ఈ ఎన్నిక‌ల త‌ర్వాత అస‌లు ఉంటుందో, ఉండ‌దో అనుకున్న పార్టీ అనూహ్యంగా గ‌తంలో కంటే 13 సీట్ల‌ను పెంచుకొని 54 సీట్లు సాధించింది. స‌తార లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించింది. 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle