సెంటిమెంట్ కింగ్.. శరద్ పవార్..!
28-11-201928-11-2019 08:17:28 IST
2019-11-28T02:47:28.909Z28-11-2019 2019-11-28T02:47:13.560Z - - 17-04-2021

మహారాష్ట్ర ఎపిసోడ్లో భారతీయ జనతా పార్టీకి భంగపాటు మిగిల్చిన 78 ఏళ్ల వృద్ధ నేత శరద్ పవార్ తనలోని రాజకీయ నేతను మరోసారి దేశానికి పరిచయం చేశారు. దేశ రాజకీయాల్లో తిరుగులేని నరేంద్ర మోడీ - అమిత్ షా ధ్వయానికి ఆయన మహారాష్ట్రలో పుల్‌స్టాప్ పెట్టారు. తన పార్టీలో, తన కుటుంబంలో భారతీయ జనతా పార్టీ తెచ్చిన చీలికను తన వ్యూహంతో పూడ్చుకోగలిగారు. ఇదంతా శరద్ పవార్ ఎప్పుడూ వాడే సెంటిమెంట్ కార్డు ద్వారానే సాధ్యమైంది. మహారాష్ట్ర చరిత్రలోనే యువ ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కిన శరద్ పవార్ నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర. మహారాష్ట్ర రాజకీయాలు శరద్ పవార్ లేకుండా ఊహించలేం. రాజకీయంగా భిన్న నిర్ణయాలు తీసుకున్నా, పార్టీలను చీల్చినా, కొత్త పార్టీలను పెట్టినా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఇతర పార్టీలతో కలిసినా శరద్ పవార్ ప్రజల్లో మాత్రం తన నిర్ణయాల పట్ల వ్యతిరేకత రాకుండా చూసుకున్నారు. తన అన్న కుమారుడు, తన కుడిభుజం లాంటి అజిత్ పవార్ అనూహ్యంగా బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు శరద్ పవార్ సగటు మనిషిలా ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే ఆయన శరద్ పవార్ ఎందుకవుతారు ? సెంటిమెంట్ కార్డు ప్రయోగించారు. రాజకీయాల కంటే కుటుంబాలు, బంధాలే ముఖ్యమని చెప్పారు. కుటుంబసభ్యులను పంపించి బుజ్జగించారు. తన కూతురు, అల్లుడిని పంపించి మాట్లాడించారు. చివరకు తన భార్య ప్రతిభా పవార్‌ను పంపించి అజిత్ పవార్‌ను దారిలోకి తెచ్చుకున్నారు. ప్రతిభా పవార్ అంటే అజిత్‌కు చాలా గౌరవం. ఆమె మాటను అజిత్ కాదనడనే శరద్ అలా ప్లాన్ చేశారు. అదే, అజిత్ పార్టీలో చీలిక తెచ్చి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే శరద్ పవార్ స్థానంలో వేరే వారు ఎవరైతే ఉంటే అజిత్‌పై ఆవేశంతో ఊగిపోయే వారు. విమర్శించే వారు. పార్టీ నుంచి బహిష్కరించే వారు. ఇది పార్టీలో చీలికకు కారణమయ్యేది. కానీ, శరద్ పవార్ మాత్రం సెంటిమెంట్ ద్వారా అజిత్‌ను దారిలోకి తెచ్చుకొని పార్టీకి నష్టం లేకుండా చూసుకున్నారు. ఇప్పుడే కాదు, తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో శరద్ పవార్ ఇలాంటి సెంటిమెంట్ కార్డ్‌లనే అవసరాన్ని బట్టి ప్రయోగిస్తుంటారు. ఇందుకు ఎన్నికల ముందు జరిగిన పరిణామాలే ఉదాహరణ. ఈడీ కేసులో తన పేరును నమోదు చేసినప్పుడు శరద్ పవార్ చాలా తెలివి వ్యవహరించారు. ఈడీ విచారణకు పిలవకముందే విచారణకు వస్తానని ప్రకటించారు. చరిత్రలో ఎప్పుడూ ఢిల్లీ ముందు మహారాష్ట్ర తల వంచలేదని బ్యానర్లు ఏర్పాటు చేయించి మరాఠా ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చారు. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న సమయంలో ఆయన కంటతడి పెట్టారు. ఇది అక్కడి ప్రజలను భావోద్వేగానికి గురి చేసింది. ఈ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ఎన్సీపీ పని ఖతం అనుకునే స్థాయిలో ఉన్న పార్టీని తిరిగి నిలబెట్టారు. ఏకంగా ఇప్పుడు అధికారంలో భాగమయ్యేలా చేశారు. పార్టీని కాపాడుకోవడంలోనూ, నాలుగు దశాబ్దాలుగా తన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలోనూ శరద్ పవార్ ఇదే వైఖరిని అవలంభించారు. పార్టీ నాయకులు, క్యాడర్‌తో ఆయన ఆప్యాయంగా ఉంటారు. వారిని కలిసినప్పుడు పార్టీ గురించి, రాజకీయాలపైనే చర్చించకుండా వారి కుటుంబం బాగోగుల గురించి అడుగుతారు. దీంతో పార్టీ నేతలకు శరద్ పవార్ అంటే ఆప్యాయత. ఈ ఆప్యాయత వల్లే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయినా పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తాము శరద్ పవార్‌తోనే ఉంటామని ప్రకటించారు. ఇలా సెంటిమెంట్ కింగ్‌గా శరద్ పవార్ తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
35 minutes ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
28 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
2 hours ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
21 hours ago
ఇంకా