newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సుప్రీంకోర్టులో పిటిషన్ డిస్మిస్...నేడే ఉద్ధవ్ విశ్వాసపరీక్ష

30-11-201930-11-2019 08:52:50 IST
Updated On 30-11-2019 12:47:28 ISTUpdated On 30-11-20192019-11-30T03:22:50.219Z30-11-2019 2019-11-30T03:22:47.205Z - 2019-11-30T07:17:28.702Z - 30-11-2019

సుప్రీంకోర్టులో పిటిషన్ డిస్మిస్...నేడే ఉద్ధవ్ విశ్వాసపరీక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర రాజకీయాలు పక్షం రోజులుగా ఉత్కంఠను రేపాయి. దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడం, వెంటవెంటనే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచకా  జరిగిపోయాయి.

గురువారం శివాజీపార్కులో ఉద్దవ్ థాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఉద్ధవ్‌ ఠాక్రే  నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహా వికాస్‌ ఆఘాడి’ ద్వారా ప్రభుత్వం ఏర్పాటైంది,. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు డిసెంబర్‌ 3 వరకు గడువు ఇచ్చారు. అయితే మూడురోజులు ముందుగానే ఆయన మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు.

నవంబర్‌ 30 మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం అయింది. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుండడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్‌ వాల్సే పాటిల్‌ను కొత్త ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఫడ్నవీస్‌ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్‌ కాళిదాసు కొలాంబ్కర్‌ స్థానంలో పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు.

ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్‌ పాటిల్‌ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. మరోవైపు సుప్రీంకోర్టు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. వివిధ రాజకీయ పక్షాలతో పొత్తుపెట్టుకోవడం పార్టీల హక్కు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై  జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారించింది.

రాజకీయ నైతికత, రాజ్యాంగ నైతికత వేర్వేరని, వాటిని పోల్చలేమని స్పష్టం చేసింది.  ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారితో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై  అఖిల భారత హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల అనంతరం జరిగే పొత్తుల్లో కోర్టును లాగవద్దని ధర్మాసనం పేర్కొంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle