newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సుప్రీంకి చేరిన మహా పాలిటిక్స్...సర్వత్రా ఉత్కంఠ

24-11-201924-11-2019 12:58:23 IST
2019-11-24T07:28:23.014Z24-11-2019 2019-11-24T07:28:16.561Z - - 14-04-2021

సుప్రీంకి చేరిన మహా పాలిటిక్స్...సర్వత్రా ఉత్కంఠ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహా పాలిటిక్స్ గత నెలరోజుల నుంచి రోజుకోరకంగా మారుతున్న సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సహకారంతో మహారాష్ట్రలో సర్కార్ ఏర్పడినా.. శివసేన -కాంగ్రెస్ పార్టీలు సుప్రీం మెట్లెక్కాయి. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటును సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాయి.

ఈరోజే ఫడ్నవీస్‌ బలపరీక్ష నిర్వహించాలని మూడు పార్టీలు కోరాయి. వీటిపై నేడు ఉదయం 11.30 గంటలకు సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ జరగనుంది. శివసేన పిటిషన్ ను జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

శరద్ పవార్ వెంట మేముున్నామంటూ మెజార్టీ ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేరడంతో మళ్ళీ టెన్షన్ నెలకొంది. శనివారం ఉదయం అజిత్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి పాతగూటికి చేరారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు చట్ట విరుద్ధమని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌పటేల్‌ మండిపడుతున్నారు.  ఎన్‌సిపి నేత అజిత్‌పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.

గవర్నర్ వ్యవహరించిన తీరుపై విపక్షాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. దీని వల్ల అక్రమ కార్యాకలాపాలు అర్థరాత్రి జరుగుతాయని, రహస్యంగా ప్రమాణస్వీకారం చేయడం అవమానకరమని అంటున్నారు. మహారాష్ట్రలో ఈ పరిణామాలు చూసి తాను ఖంగుతిన్నానని కాంగ్రెస్‌ ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వీ అన్నారు. దీనిలో తమ జాప్యం కూడా ఉందని అంగీకరించారు. త్రైపాక్షిక చర్చలు మూడురోజులకు మించి జరగకూడదని ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. 

కాంగ్రెస్‌ మీడియా ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఇది ఘోరమైన వెన్నుపోటుగా పేర్కొన్నారు. త‌మ‌కు  144 మందికిపైగా మద్దతు ఉందని కోర్టుకి తెలిపాయి కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరడంతో కోర్టు ఏం చెబుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రపతిభవన్, రాజ్‌భవన్‌ను బీజేపీ దుర్వినియోగం చేసిందని... మహారాష్ట్రకు నవంబర్ 23  చీకటిరోజు అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో మరో అనూహ్య పరిణామాం చోటు చేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ కకాడే వెళ్ళారు. దీంతో అసలు ఏం జరుగుతోందనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. సంజయ్ తోపాటు ఎన్సీపీ సీనియర్ లీడర్ జయంత్ పాటిల్ కూడా అక్కడే ఉన్నారు.. సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణ కు రానున్న సమయంలో శరద్ పవార్ ని బీజేపీ నేత కలవడం తీవ్ర చర్చనీయాంశమౌతోంది.

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   28 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   2 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   a day ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle