సున్నీ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం
25-02-202025-02-2020 09:06:15 IST
2020-02-25T03:36:15.600Z25-02-2020 2020-02-25T03:35:54.297Z - - 11-04-2021

అయోధ్య వివాదం సమసిపోయింది. అటు సున్నీ వక్ఫ్ బోర్డు.. హిందూ సంఘాలు దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుని శిరసా వహిస్తామని తెలిపాయి. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగనుంది. అలాగే కోర్టు తీర్పు ప్రకారం ముస్లింలకు స్థలం కేటాయించింది. అయోధ్య జిల్లాలో మసీదు నిర్మాణం కోసం తమకు కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు పేర్కొంది. ఈ స్థలంలో మసీదు నిర్మాణంతో పాటుగా.. ఇండో- ఇస్లామిక్ పరిశోధన సంస్థ, ఆస్పత్రి, గ్రంథాలయం నిర్మిస్తామని తెలిపింది. ఈ మేరకు త్వరలోనే మసీదు నిర్మాణానికై ట్రస్టు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొంది. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు స్థలం కేటాయించింది. ఈ స్థలంపై సున్నీ వక్ఫ్ బోర్డు ఏం నిర్ణయం ప్రకటిస్తుందోనని అంతా ఆసక్తి గా ఎదురుచూశారు. ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తాము స్వీకరిస్తున్నామని సున్నీవక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖీ ప్రకటించడంతో ఉత్కంఠ తీరిపోయింది. బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ట్రస్టు ఏర్పాటు చేస్తాం. మసీదుకు ఏ పేరు పెట్టాలన్న విషయాన్ని ట్రస్టు నిర్ణయిస్తుందని తెలిపారు. అయోధ్యలో తమకు కేటాయించిన స్థలంలో మసీదుతో పాటు లైబ్రరీ, పరిశోధన సంస్థ, ఆస్పత్రి.. నిర్మించడంతో పాటుగా.. భూమిని అన్నిరకాలుగా వినియోగించుకుంటామని వక్ఫ్ బోర్డు తెలిపింది. అంతకుముందే కేంద్రం అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటుచేసింది. కేంద్రం 15 మంది సభ్యులతో రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసింది. పత్రాయ్ను ప్రధానకార్యదర్శిగా, గోవిందగిరిని కోశాధికారిగా ఉన్నారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణసమితికి ప్రధాని మోదీ మాజీ ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించనున్నారు. ఈ ట్రస్ట్ సభ్యులు నృత్యగోపాల్దాస్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేయనుంది కేంద్రం. ఈమధ్యే ట్రస్ట్ సభ్యులు ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే. ఎప్పటిలోగా రామ మందిరాన్ని పూర్తి చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. మందిర నిర్మాణానికి కావాల్సిన విరాళాలపై చర్చ జరిగింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
17 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
20 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా