సీరియల్ని తలపిస్తున్న మధ్యప్రదేశ్ ఎపిసోడ్
19-03-202019-03-2020 08:23:09 IST
2020-03-19T02:53:09.671Z19-03-2020 2020-03-19T02:53:00.255Z - - 22-04-2021

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా ట్విస్ట్ లు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం మరో రోజుకూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీ, కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి తో బాటు మరో సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే కూడా చేసిన వాదనలు, ప్రతివాదనలతో సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. 22 మంది రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఓ వైపు మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అసెంబ్లీలో బలనిరూపణ జరిగేలా చూడాలంటూ బీజేపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. సుప్రీంలో దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. 19 మంది ఎమ్మెల్యేలు రాసినట్టు చెబుతున్న రాజీనామా లేఖలను ఒక్కరే రాశారని, ఇతర ఎమ్మెల్యేలు దానిపై సంతకాలు చేశారని, పైగా ఆరుగురు సభ్యుల తరఫున మరో ఇద్దరు రాజీనామా లేఖలను రూపొందించారని కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి ఆరోపించడం కొసమెరుపు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఎక్కువ అవుతోందన్నారు. ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయడం, న్యాయబధ్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడంకాదా అని మరో న్యాయవాది దుశ్యంత్ దవే అన్నారు. బీజేపీ తరఫున వాదించిన లాయర్ ముకుల్ రోహ్తగీ.. రాష్ట్రంలో అధికారంలో కొనసాగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తాము ఎమ్మెల్యేలనెవరినీ కిడ్నాప్ చేయలేదని, వారే స్వచ్ఛందంగా భోపాల్ నుంచి బెంగుళూరు చేరుకున్నారన్నారు. అటు-జస్టిస్ వై.వి.చంద్రచూడ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్ ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరపాలని సుప్రీంకోర్టు కమల్నాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. బెంగళూరులో మకాం వేసిన 21మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రమాడ హోటల్లో తలదాచుకున్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బెంగళూరు వెళ్లారు. కర్ణాటక కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు శివ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారు హోటల్ దగ్గరకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లటానికి వీళ్లేదంటూ బయటే ఆపేయడం కాసేపు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచారని, వారి ఫోన్లను లాక్కున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాస పరీక్షను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా విశ్వాస పరీక్ష నిర్వహిచాలని గవర్నర్ లాల్జీ టాండన్ అర్ధరాత్రి ఆదేశించడం సరైంది కాదని లాయర్ దుష్యంత్ దవే అన్నారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా