newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఏఏ, ఎన్నార్సీలపై వామపక్షాల నిరసన

08-01-202008-01-2020 13:15:18 IST
Updated On 08-01-2020 13:15:50 ISTUpdated On 08-01-20202020-01-08T07:45:18.202Z08-01-2020 2020-01-08T07:45:10.408Z - 2020-01-08T07:45:50.965Z - 08-01-2020

సీఏఏ, ఎన్నార్సీలపై వామపక్షాల నిరసన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వామపక్షాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎండగడుతున్నాయి. కార్మిక సంఘాలు, విద్యార్ధి, మహిళా సంఘాలు ఈ బంద్ కు మద్దతు పలికాయి. కేంద్రం ఆర్ఎస్ఎస్ విధానాలను జనంపై రుద్దుతోందని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 ప్రధాన కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా ఈ సమ్మె జరగనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్‌లో దాదాపు 25 కోట్ల మంది దాకా పాల్గొంటున్నారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి.

ఇటు ఏపీలో అన్ని జిల్లాల్లో బంద్ నిర్వహిస్తున్నారు. విజయవాడలో వామపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో వామపక్ష నేతలతో పాటు కార్మిక సంఘాలు కదంతొక్కాయి. ఉదయం నుంచి కార్మికులంతా సమ్మెలో పాల్గొని నిరసనలు తెలిపారు. ఇటు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో బంద్ జరుగుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle