newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఏఏపై మోడీ సర్కార్ పట్టు... అణచివేతే మార్గమా?

18-12-201918-12-2019 09:29:58 IST
Updated On 18-12-2019 10:31:13 ISTUpdated On 18-12-20192019-12-18T03:59:58.917Z18-12-2019 2019-12-18T03:59:49.237Z - 2019-12-18T05:01:13.403Z - 18-12-2019

సీఏఏపై మోడీ సర్కార్ పట్టు... అణచివేతే మార్గమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా సీఏఏ పై నిరసనలు హోరెత్తుతున్నాయి. పౌరసత్వ సవరణల చట్టం అమలుపై హోంమంత్రి తమ  వైఖరిని స్పష్టం చేశారు. ముస్లిమేతర శరణార్థులందరికీ పౌరసత్వం ఇచ్చి తీరతామంటున్నారు అమిత్ షా. చొరబాటుదారులకు దేశంలో చోటు ఉండకూడదన్నారు. విద్యార్ధులు వాస్తవిక దృక్పథంలో వ్యవహరించాలన్నారు. విద్యార్థులపై చర్యలు ఉండవన్నారు. 

విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆలోచనలను పెంపొందించే కేంద్రాలుగా మారాలని, మన దేశం, సమాజం ఎదుర్కొంటున్న కొన్ని ప్రత్యేక సమస్యలకు పరిష్కారం చూపడంలో ఉన్నత విద్యాసంస్థలే కీలకపాత్ర పోషించాలన్నారు  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. పౌరసత్వ సవరణ చట్టవల్ల ఏ ఒక్క భారతీయుడి పౌరసత్వం రద్దు కాదన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 

దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలిస్తున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటన హాట్ టాపిక్ అవుతోంది. వివిధ రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలపై ఆయన స్పందించారు.

ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టంపై వెనక్కి తగ్గేది లేదనీ, దీని అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విపక్షాలు కోరుతున్నట్లు దీనిని ఉపసంహరించుకునే ప్రశ్నే లేదన్నారు.

దేశంలో ఏ ముస్లిం హక్కులనూ, పౌరసత్వాన్ని ఈ చట్టం హరించదన్నారు. భారతీయ ముస్లింలకు సంబంధించి ఎలాంటి నిబంధనలూ ఇందులో లేవన్నారు హోంమంత్రి అమిత్ షా. ఈ దేశ పౌరులు. విదేశాల్లో బాధలు పడుతున్న వేలాది మంది ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించి వారు గౌరవంగా బతికే అవకాశం కల్పిస్తుందన్నారు అమిత్ షా. 

ఏ ఒక్క చొరబాటుదారునూ ఉపేక్షించమని, వారిని వెళ్లగొట్టి తీరతాం అన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న జామియా విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని, అల్లర్లకు, విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులపై మాత్రమే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. ఈ చట్టం వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు లేవని, అలాంటి ఆలోచన వుంటే ఎన్నికల ముందే ఈ చట్టం తెచ్చేవారమని కాంగ్రెస్ పై మండిపడ్డారు అమిత్ షా. 

మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ తీరుపై ఆందోళన కారులు మండిపడుతున్నారు. వివాదాస్పద పౌరసత్వ చట్టానికి జేడీయూ మద్దతు ప్రకటించడంపై ఆ రాష్ట్ర పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా తామంతా నిరసన చేపడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. సీఎం కనిపించడం లేదంటూ వారు విమర్శలు చేస్తున్నారు. 

దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసేవారిపై ‘కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు జారీ చేస్తామని రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్‌ అంగడి హెచ్చరించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle