సీఏఏపై ఆగని నిరసన సెగలు.. పద్మశ్రీ తిరిగిచ్చేసిన ఉర్దూ కవి
19-12-201919-12-2019 10:04:51 IST
Updated On 19-12-2019 11:14:46 ISTUpdated On 19-12-20192019-12-19T04:34:51.160Z19-12-2019 2019-12-19T04:31:32.955Z - 2019-12-19T05:44:46.385Z - 19-12-2019

దేశవ్యాప్తంగా కేంద్రం అమలులోకి తీసుకురానున్న పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కొనసాగుతూనే వున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులను ఎదుర్కొని డిసెంబర్ 31, 2004లోపు భారత్‌కు వలస వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్, జైన్, పార్శీ, బౌద్ధ మతస్తులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇటీవలే పార్లమెంట్ ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది.
ఈ చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. సీఏఏను వ్యతిరేకిస్తూ జరిపే నిరసనలు ముస్లింలను రక్షించడానికి కాదని, మొత్తం దేశాన్ని రక్షించేందుకని జేఎన్‌యూ విద్యార్థి సంఘ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అన్నారు.
పౌరసత్వ చట్టం కన్నా ఎన్నార్సీ చాలా ప్రమాదకరమైనదన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్లోని దినాజ్‌పూర్ జిల్లాలో సీఏఏ నిరసన ప్రదర్శనపై దుండగులు నాటు బాంబులు విసరడంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ముఖ్యమంత్రి మమత స్వయంగా పాల్గొనడం విశేషం.
‘దేశంలోని మంటలను ఆర్పాల్సింది పోయి.. దేశాన్ని మంటల్లోకి నెడుతున్నారు. ఇది మీ ఉద్యోగం కాదు’అని హోం మంత్రి అమిత్‌షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్..’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు కానీ.. దేశంలోని ప్రతి ఒక్కరిని వినాశనాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు మమత బెనర్జీ. మమతకు మద్దతు ప్రకటించాయి పలు రాష్ట్రాలు.
ఇటు నటుడు కమల్ హాసన్ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మద్రాస్ వర్సిటీలో ధర్నా చేస్తున్న విద్యార్థులకు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సంఘీ భావం తెలిపారు.
క్యాంపస్ లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో, వెలుపలి నుంచే విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కేంద్రం తీరుని ఆయన తప్పుబట్టారు. ఎన్నార్సీ బిల్లుకు బీజేడీ మద్దతివ్వదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. ఒడిశా ప్రజలు అపోహలు నమ్మవద్దని శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. పౌరసత్వ సవరణ చట్టంతో భారతీయులకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు.
పద్మశ్రీ అవార్డు వాపస్

2007లో కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వాపస్ ఇచ్చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు ప్రముఖ ఉర్దూ రచయిత ముజ్తాబా హుస్సేన్.. పౌరసత్వ సవరణ చట్టాన్నివ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. .ఉర్దూసాహిత్యంలో అయన చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. దేశంలో ప్రస్తుత పరిస్థితులపట్ల తాను సంతృప్తితో లేనని, ఈ అవార్డును తన దగ్గర ఉంచుకోలేనని స్పష్టం చేశారు.


ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
11 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
13 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
20 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా