newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

సీఎం ఫడ్నవీస్‌పై కాంగ్రెస్ యుద్ధం

25-06-201925-06-2019 07:56:49 IST
2019-06-25T02:26:49.166Z25-06-2019 2019-06-25T02:26:35.794Z - - 20-09-2019

సీఎం ఫడ్నవీస్‌పై కాంగ్రెస్ యుద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ మీద రెచ్చిపోయేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మంచి అవ‌కాశం దొరికింద‌ట‌. మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ, క్ర‌మంగా రాష్ట్రంలో బ‌లం కోల్పోతూ వస్తోంది. పార్టీ అధిష్టానంలో నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న‌, జ‌నంలో పార్టీ మీద న‌మ్మ‌కం పోవ‌డంతో, ఆ పార్టీ నాయ‌కులు ఒక్కొక్క‌రుగా బీజేపీ, శివ‌సేన‌లోకి వెళ్తున్నారు. ఈ స‌మ‌యంలో అధికార బీజేపీ, శివ‌సేన కూట‌మిని ఎలా ఎదుర్కోవాలా అన్న మీమాంసలో ప‌డ్డ కాంగ్రెస్ నేత‌ల‌కు దాణా కుంభ‌కోణం అందివచ్చిన అవ‌కాశంగా మారింద‌ట‌. 

ఈ స్కాంలో ఏ మేర‌కు నిధులు ప‌క్క‌దారి ప‌ట్టాయ‌న్న సంగ‌తేమో కానీ, వ‌చ్చిన చిన్న‌పాటి అవ‌కాశం మీద కాంగ్రెస్ నేత‌లు ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. క‌రువు ప్రాంతాల్లో తాగునీరు, పశుగ్రాసం అందించే పేరుతో బీజేపీ, శివ‌సేన నేత‌లు ప్ర‌భుత్వ నిధుల‌ను తినేశార‌న్న‌ది ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు అశోక్ చ‌వాన్ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. 

బినామీ పేర్ల‌తో ఎన్జీవో సంస్థ‌లు పుట్టించిన బీజేపీ, శివ‌సేన నేత‌లు, క‌రువు ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి, ప్ర‌భుత్వ ఖ‌జానా లూటీ చేశార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మ‌రాట్వాడా ప్రాంతంలో అధికార పార్టీలు ఏర్పాటు చేసిన స‌హాయ‌క శిబిరాలు బీజేపీ, శివ‌స‌నే కార్య‌క‌ర్త‌ల విడిగి గృహాలుగా మారాయ‌నీ, ప్రభుత్వం ప్ర‌జ‌ల కోసం విడుద‌ల చేసిన నిధుల‌తో ఈ రెండు పార్టీల నేత‌లు జ‌ల్సా చేశార‌ని అశోక్ చ‌వాన్ ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. 

బీడ్ జిల్లాలో ఏర్పాటు చేసిన క‌రువు శిబిరాల్లో దాదాపు 16000 ప‌శువుల‌కు స‌రిగ్గా నీళ్లు, గ్రాసం పెట్ట‌లేద‌నీ, మొక్కుబ‌డిగా ప‌నులు చేసి, మిగిలిన సొమ్ము మొత్తం మింగేశార‌ని అశోక్ చ‌వాన్ ఆరోపిస్తున్నారు. మొత్తానికి దొర‌క్క దొరికిన ఈ అవ‌కాశం రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ మేర‌కు ల‌బ్ది చేకూరుస్తుందో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle