newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఎం కావాలనే ఆశలేదు.. పార్టీలో యువతకే ప్రాధాన్యం

12-03-202012-03-2020 13:37:32 IST
Updated On 12-03-2020 14:35:30 ISTUpdated On 12-03-20202020-03-12T08:07:32.760Z12-03-2020 2020-03-12T08:07:24.115Z - 2020-03-12T09:05:30.878Z - 12-03-2020

సీఎం కావాలనే ఆశలేదు.. పార్టీలో యువతకే ప్రాధాన్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడిందని, పదవులపై వ్యామోహంతో తాను రాజకీయాల్లోకి రావడం లేదన్నారు నటుడు రజనీకాంత్‌. చెన్నెలో మీడియా సమావేశంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. చెన్నైలోని హోటల్ లీలా ప్యాలెస్ లో అభిమానులతో సమావేశమైన సూపర్ స్టార్  రజనీకాంత్..కార్యకర్తలకు, అభిమానులకు దిశానిర్దేశం చేశారు. నాయకుడు చెప్పిన మాట వినేవాళ్లు కార్యకర్తలని, ‌2017లోనే నాకు పదవులపై వ్యామోహం లేదని చెప్పానన్నారు రజనీకాంత్‌.

గతంలో తాను అన్న మాటల్ని డిజిటల్ తెరపై ప్రసారం చేసిన రజనీకాంత్‌..నిజాయతీపరులకే పదవులు ఇస్తామన్నారు. ప్రజల మనసులో ప్రేమ, నీతి, నిజాయతీ ఉన్నవాళ్లకే సీఎం స్థానం వస్తుందన్నారు రజనీకాంత్. నేను పార్టీలో అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని, రాజకీయాల్లో విద్యా ప్రమాణాలు, వయస్సు కూడా ముఖ్యమే అన్నారు. పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదని తన అభిప్రాయం వెలిబుచ్చారు. 

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, సీఎం పదవిపై వ్యామోహం లేదన్నారు. తన పార్టీలో 65 శాతం యువకులకే అవకాశం ఉంటుందని. ఒక విషయంలో అసంతృప్తితో ఉన్నానన్నారు రజనీకాంత్‌. నా అసంతృప్తి విషయంపై చాలా ఊహాగానాలు ఉన్నాయని, వాటిపై ప్రస్తుతం స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాఅన్నారు. 1996కి ముందు ఏనాడూ రాజకీయాల గురించి ఆలోచించలేదని, ప్రజలు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పానన్నారు.

భగవంతుడే శాసిస్తేనే నేను ఆచరిస్తానన్నారు. రెండేళ్లక్రితం రాజకీయాల్లోకి వస్తానని మొదటిసారిగా చెప్పానని, వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదన్నారు. ‌2016-17లో రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లోపించిందని, తమిళనాడు రాజకీయాలను బాగా విశ్లేషించాకే ఈ అభిప్రాయానికి వచ్చానన్నారు. మం రాజకీయాల్లోకి రావట్లేదని, అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో కష్టపడ్డవారికి కాకుండా వేరేవారికి ఆ పదవులు వస్తున్నాయన్నారు. ‌60 నుంచి 65 శాతం పార్టీలో 50 ఏళ్ల లోపువారికే అవకాశం ఇస్తానన్నారు. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle