newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

సిద్దూపై కుమారస్వామి హాట్ కామెంట్స్

26-08-201926-08-2019 09:08:57 IST
Updated On 26-08-2019 12:18:36 ISTUpdated On 26-08-20192019-08-26T03:38:57.560Z26-08-2019 2019-08-26T03:37:51.036Z - 2019-08-26T06:48:36.999Z - 26-08-2019

సిద్దూపై కుమారస్వామి హాట్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటక రాజకీయాల్లో ఆరోపణల పర్వం కొనసాగుతోంది. నిన్నామొన్నటివరకూ కలిసి పనిచేసిన కుమారస్వామి-సిద్ధరామయ్య మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. తాజాగా కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కంటే తనకు కాంగ్రెస్ ప్రధాన శత్రువు అంటూ కామెంట్లు చేశారు కుమారస్వామి. సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్యపై మూడు రోజుల నుంచి జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

తమ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించారు, తాను సీఎం కావడాన్ని ఆయన ఏమాత్రం సహించలేకపోయారని మీడియాతో ఆదివారం వ్యాఖ్యానించడంతో రాజకీయాలు వేడెక్కాయి.

సంక్షోభం సమయం లోనూ సిద్ధరామయ్యేనే టార్గెట్ చేశారు కుమారస్వామి, తనవర్గం ఎమ్మెల్యేల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారి చేత రాజీనామాలు చేయించారన్నారు. 

సంకీర్ణ ధర్మాన్ని పాటించలేదని, ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారకులయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని కాంగ్రెస్‌ పార్టీ అధిస్టానం సూచించడంతో, ఇష్టం లేకపోయినా బలవంతంగా తనను ముఖ్యమంత్రిగా అంగీకరించారన్నారు. ఆయన ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో  తాను పూర్తి అధికారాలు ఉపయోగించుకోలేక పోయానని, క్లర్క్ గా పనిచేశానని అన్నారు.

ఇదిలా ఉంటే.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని కుమారస్వామి మాటదాటేశారు. ఆదివారం సాయంత్రానికే కుమారస్వామి మాట మార్చడం విశేషం.  తానెప్పుడూ సిద్ధరామయ్య తన తొలి శత్రువు అని చెప్పలేదన్నారు. డిజిటల్‌ మీడియా విలేకరులకు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన సందేశాన్ని తాజాగా కొందరు మార్చి చెబుతున్నారని అన్నారు. కుమారస్వామి మాట మార్చడంపై మీడియా అవాక్కయింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle