newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సిఏఏ.. దేశమంతా ఒకటే మాట .. నిరసన బాట

20-12-201920-12-2019 09:26:13 IST
Updated On 20-12-2019 10:37:09 ISTUpdated On 20-12-20192019-12-20T03:56:13.733Z20-12-2019 2019-12-20T03:56:03.508Z - 2019-12-20T05:07:09.719Z - 20-12-2019

సిఏఏ.. దేశమంతా ఒకటే మాట .. నిరసన బాట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి.బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఆందోళనలపై ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ. పలు పట్టణాలు, విశ్వవిద్యాలయాల్లో వివిధ పార్టీల విద్యార్థి సంఘాలు భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. యూపీ, బిహార్‌ల్లో ఆందోళనలు హింసాత్మకమయ్యాయి. కర్నాటకలో ఇద్దరు, యూపీలో ఒకరు మరణించారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఆందోళన ల్లో పాల్గొన్న లెఫ్ట్‌ నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, నీలోత్పల్‌ బసు, బృందా కారత్, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా ఆందోళనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.

ఢిల్లీలోని ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో అధికారులు 144 సెక్షన్‌ కొనసాగుతోంది. సునిశిత  ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను, మొబైల్‌ సేవలు నిలిచిపోయాయి.  సీఏఏ వ్యతిరేక నిరసనల కేంద్రంగా నిలిచిన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కేరళ, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

దేశరాజధాని ఢిల్లీలో ఆందోళనల తీవ్రత తగ్గలేదు.  ఎర్రకోట, జంతర్‌మంతర్, మండిహౌజ్‌ తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. 1975 నాటి ఎమర్జెన్సీ కన్నా పరిస్థితి దారుణంగా ఉందని మండిహౌజ్‌ వద్ద ఆందోళనల్లో పాల్గొని అరెస్టైన సీపీఎం నేత ఏచూరి మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ను ఆందోళనకారులు తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్, టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. 

బీహార్లో వామపక్ష విద్యార్థులు రోడ్లను, రైల్వే ట్రాక్‌లను నిర్బంధించి నిరసన తెలిపారు. పట్నాలో మాజీ ఎంపీ పప్పు యాదవ్‌ నేతృత్వంలోని జన అధికార పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముంబైలోని క్రాంతి మైదాన్‌లో కాంగ్రెస్, ఎన్సీపీ, పలు ఇతర పార్టీలు ‘హమ్‌ భారత్‌ కే లోగ్‌’ పేరుతో ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

కోల్‌కతాలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో నాలుగవరోజు పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై దేశవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. మంగళూరులో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. మంగళూరు నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించి, పోలీసులపై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారని, వారిని అడ్డుకునే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle