newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సింధియా నిష్క్రమణతో ముగిసిన శకం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి గండం

11-03-202011-03-2020 12:23:56 IST
2020-03-11T06:53:56.232Z11-03-2020 2020-03-11T06:53:54.374Z - - 15-04-2021

సింధియా నిష్క్రమణతో ముగిసిన శకం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి గండం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక చరిత్ర ముగిసిపోయింది. గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియాను ధిక్కరించి ఆజన్మాంతం కాంగ్రెస్‌ పార్టీని వదలని ఆమె తనయుడు మాధవ్‌రావు సింధియా కుమారుడు యువనేత జ్యోతిరాదిత్య సింధియా ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ పార్టీనుంచి బయటపడ్డారు. దీంతో గ్వాలియర్ రాజవంశం వారసులు పూర్తిగా బీజేపీ చెంత చేరినట్లే చెప్పుకోవాలి. రాజమాత తనయ వసుంధరా రాజే తల్లి బాటలో నడిచి తొలి నుంచి బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిపెద్ద వికెట్ స్థానం మార్చుకోవడంతో ఆ పార్టీ సమీప భవిష్యత్తులో కోలుకోవడం కష్టమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

పార్టీపట్ల రకరకాల అసమ్మతులతో, అసంతృప్తులతో తమ వాళ్లతోనే గ్రూపు రాజకీయాలతో విసిగిపోవడం వల్లో కార్యకర్తలు, నాయకులు తాము అన్నాళ్లుగా నమ్మిన, కొనసాగిన పార్టీకి మంగళం పలికి మరో బలమైన పార్టీలో చేరిపోవడం మన దేశ చరిత్రలో కొత్తేమీ కాదు. కానీ తండ్రిబాటలోనే నడిచి కాంగ్రెస్‌ను రెండు దశాబ్దాలకు పైగా అంటిపెట్టుకుని ఉన్న జ్యోతిరాదిత్య సింధియా మాతృసంస్థను వీడి దానికి పూర్తిగా విరుద్ధమైన బీజేపీలో చేరబోవడం మామూలు రాజీనామాగా చూడటం అసాధ్యం. యువనేత బాటలో మరో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను రాజ్‌భవన్‌కు పంపడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

దాదాపు 15 ఏళ్ల విరామంతర్వాత మధ్యప్రదేశ్‌లో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు పతనం అంచుకు చేరిపోయినట్లే లెక్క. గ్వాలియర్‌ రాజ కుటుంబానికి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌ను వీడటం.. ఆ వెంటనే ఆయనకు మద్దతుగా 22 మంది శాసన సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్‌కు లేఖలు పంపడంతో సీఎం కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

రాజీనామాలు చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు ఆమోదం పొందితే కాంగ్రెస్‌ ప్రభుత్వం 92 మంది సొంత ఎమ్మెల్యేలతో మైనార్టీలో పడుతుంది. కాంగ్రెస్‌కు ప్రస్తుతం మద్దతిస్తున్న ఏడుగురు ఇతర సభ్యుల మద్దతు కీలకం కానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ శాసన సభా పక్ష సమావేశాలను నిర్వహించి తమ ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి తరలించాలని నిర్ణయించాయి.  

ఈ అనూహ్య పరిణామాలన్నింటికీ కేంద్రబిందువై నిలిచిన జ్యోతిరాదిత్య కాంగ్రెస్ ఆశలకు గండికొడుతూ బీజేపీకి కొత్త ఊపిరిని తీసుకొచ్చారంటే అతిశయోక్తి కాదు. పైగా 18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న తనకు ఇక ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ సింధియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపిన లేఖ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భూస్థాపితానికి దారి తీసినా తీయవచ్చని అంటున్నారు. మంగళవారం ఉదయం తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమైన సింధియా తర్వాత షాతో కలిసి ప్రధాని మోదీ నివాసానికి చేరుకుని ఆయనతో దాదాపు గంటపాటు చర్చించారు. 

అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియాకు సింధియా లేఖ పంపారు. ‘18 ఏళ్లుగా కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నా. ఇక ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ప్రస్తుత పరిస్థితిల్లో ఇంకా పార్టీలో కొనసాగితే దేశ, రాష్ట్ర ప్రజలకు సేవ చేయలేనని అనిపిస్తోంది. నా ప్రజలు, కార్యకర్తల కోసం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మెరుగని భావిస్తున్నా. ఇన్నాళ్లూ దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా’ అని తన లేఖలో సింధియా పేర్కొన్నారు. అనంతరం  కాంగ్రెస్‌ నుంచి సింధియా బహిష్కరణను సోనియా ఆమోదించినట్లు ఏఐసీసీ తెలిపింది.

జ్యోతిరాదిత్య నేడో రేపో బీజేపీలో చేరవచ్చని, ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు ఈనెల 13తో గడువు ముగుస్తున్నందున ఈలోపే ఆయన కచ్చితంగా బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. సింధియా నిర్ణయాన్ని ‘ఘర్‌ వాపసీ’గా ఆయన మేనత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధరా రాజే అభివర్ణించారు. తన తండ్రి, దివంగత కాంగ్రెస్‌ నేత మాధవరావు సింధియా 75వ జయంతి రోజే జ్యోతిరాదిత్య పార్టీతో బంధాన్ని తెంచుకోవడం గమనార్హం.  

దేశమంతా హోలీ సంబరాల్లో ఉన్న వేళ కాంగ్రెస్‌కు పెద్ద షాక్, కమల్ నాథ్ ప్రభుత్వానికి పిడుగుపాటు తగిలింది. అంతకంటే మించి అమిత్‌షా, ప్రధాని మోదీతో భేటీ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించగానే బీజేపీ కార్యకర్తలు రంగులు  చల్లుకుంటూ నృత్యాలు చేశారు. ఈ క్షణం కోసం గత 15 నెలలుగా బీజేపీ కార్యకర్తలు, నేతలు ఎంతగా వేచిచూశారో వారి సంతోష సంబరాలే తెలిపాయి.

ఏతావాతా తేలిందేమిటంటే కాంగ్రెస్ పార్టీ ముదివగ్గులను అంటిపెట్టుకుని బలమైన ప్రాంతీయ యువనేతలను బలిగొనడానికే సిద్ధమైందని జ్యోతిరాదిత్య సింధియా ఉదంతం తేటతెల్లం చేయడంతో మధ్యప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పట్ల నమ్మకం సడలని యువనేతలు కేంద్రంలోని అధికార పక్షం వైపు చూడడం వేగం పుంజుకోవచ్చు.

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల భారం మొత్తంగా తనపై వేసుకుని తీవ్ర శ్రమకోర్చి పార్టీని అధికారంలో నిలపడంలో కీలకపాత్ర వహించిన జ్యోతిరాదిత్యను తొలినుంచి అదిష్టానం, రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తూనే వచ్చారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ లోని ముదివగ్గులతో వేగలేక తానే కాడి కింద పడేసి విశ్రాంతిగా కూర్చున్న సమయంలో జ్యోతిరాదిత్య వంటి చురుకైన నేతలకు కాంగ్రెస్‌తో తమ ప్రయాణం ఇక ముగిసిపోతోందని అర్థమైంది. దీని తక్షణ పర్యవసానంగా మధ్యప్రదేశ్‌లోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 22 మంది వెంటనే రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ అధిష్టానానికి బీజేపీపై ఆరోపణలు చేయడానికి కూడా సాధ్యం కాకుండా పోయింది.

ఎగసిన అసంతృప్తి మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో పాత తరానికి చెందిన సీఎం కమల్‌నాథ్‌తో సింధియాకు దీర్ఘకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికల అనంతరం స్వల్ప మెజార్టీతో కమల్‌నాథ్‌ పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వంలో సింధియా మద్దతుదారులను పక్కనబెట్టడం, రాష్ట్ర కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు కూడా దక్కకపోవడంతో ఆయన శిబిరంలో అసంతృప్తి రాజుకుంది. కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం కూడా ఈ విషయాలను పట్టించుకోకపోవడంతో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాజా పరిణామాలతో నేతలను ఏకతాటిపై నడపటంలో నాయకత్వ లేమి మరోసారి బయటపడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన 19 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను బీజేపీ నేతల బృందం మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతికి అందచేసింది. రాజీనామా లేఖలు అందాయని, నియమ నిబంధనలను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ తెలిపారు. సీనియర్‌ బీజేపీ నేత భూపేంద్రసింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలతో ప్రత్యేక విమానంలో భోపాల్‌ చేరుకున్నట్లు పార్టీ ఎమ్మెల్యే విశ్వాస్‌ సారంగ్‌ తెలిపారు. మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నేరుగా రాజీనామాలు అందించారు. ప్రతిపక్ష నేత గోపాల్‌ భార్గవ, భూపేంద్రసింగ్, నరోత్తమ్‌ మిశ్రా, సారంగ్‌తో కూడిన బృందం స్పీకర్‌ నివాసానికి చేరుకుని కాంగ్రెస్‌ సభ్యుల రాజీనామాలను అందచేసింది.

ప్రస్తుతం 228 మంది ఎమ్మెల్యేలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో తిరుగుబాటుకు ముందు కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉండగా తాజా రాజీనామాలతో సొంత బలం 92కి పడిపోయింది. సభలో బల నిరూపణకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 104 కాగా బీజేపీకి ఇప్పటికే 107 మంది సభ్యులున్నారు. నలుగురు స్వతంత్రులతోపాటు ఇద్దరు బీఎస్పీ సభ్యులు, సమాజ్‌వాదీ పార్టీకి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇప్పటివరకు మద్దతిస్తున్నారు. తాజాగా బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్‌ సింగ్‌ కుశావహ, సమాజ్‌వాదీ శాసన సభ్యు డు రాజేశ్‌ శుక్లా మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌తో సమావేశం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

తనకు తగిలిన పిడుగుపాటు తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ తన ప్రభుత్వానికి, సీఎం పదవికి ఏమాత్రం డోకా లేదని ముఖ్యమంత్రి కమల్ నాథ్ చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. ‘‘నా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నా. వారిని బందీలుగా ఉంచారు. లేదంటే ఎమ్మెల్యేలు బెంగళూరులో ఎందుకు ఉంటారు’అని సీఎం కమల్‌నాధ్‌ మంగళవారం రాత్రి పేర్కొన్నారు. కానీ అప్పటికే పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఏర్పాటైన 15 నెలలకే పతనం దిశగా కమల్‌నాథ్‌ ప్రభుత్వం నడుస్తూ అధిష్టానానికే గుక్క తిప్పుకోకుండా చేసింది. అధికార కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తూ 22 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు లేఖలు పంపడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఉత్కంఠ కొనసాగుతుండగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆరుగురు మంత్రులను తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం కమల్‌నాథ్‌.. గవర్నర్‌ లాల్జీ టాండన్‌కు లేఖ రాశారు

రాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్న గవర్నర్ లాల్జీ టాండన్ రాజ్‌భవన్‌ చేరుకున్నాక ఈ రాజకీయ సంక్షోభంపై నిర్ణయ తీసుకుంటానని చెప్పారు. లక్నోలో హోలీ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌  ‘ప్రస్తుతం నేను ప్రేక్షకుడిని మాత్రమే. అక్కడకు (భోపాల్‌) చేరుకున్నాక అన్నీ గమనించాక స్పందిస్తా’అని చెప్పారు. అయినా 114 నుంచి 92 మందికి పడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ దయతలిచి ఊరుకుంటే తప్ప అధికారంలో ఉండటం కల్లోమాటే అని చెప్పాలి.

సింధియా వెనుక నిలిచి రాజీనామాలు సమర్పించిన 22 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మినహాయిస్తే మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్ తరపున పొత్తుపార్టీలతో కలిసి 100 మంది ఎమ్మెల్యేల దన్ను ఉంటోంది. ఎందుకైనా మంచిదని బీజేపీ తన ఎమ్మెల్యేలను హుటాహుటిన విమానంలో ఢిల్లీకి తరలించి గుర్గావ్‌లో ఫైవ్ స్టార్ హోటల్స్‌లో దింపింది. బేరసారాలు ముగిసి బుధవారం సాయంత్రానికే మధ్యప్రదేశ్ సింహాసనం ఎవరిది అనే సమస్య పరిష్కారం కావచ్చు.

సింధియాను పోగొట్టుకోవడం కాంగ్రెస్ అధిష్టానం తనకుతాను చేసుకున్న నష్టమేనని చెప్పాలి. తన మూలాలను కదిల్చివేసిన మధ్యప్రదేశ్ పరిణామాలు ఆపార్టీపై ఇంకా ఎన్ని దెబ్బలు తగిలిస్తాయో వేచి చూడాల్సిందే.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle