newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

18-01-202018-01-2020 12:50:32 IST
Updated On 20-01-2020 17:27:40 ISTUpdated On 20-01-20202020-01-18T07:20:32.188Z18-01-2020 2020-01-18T07:20:30.674Z - 2020-01-20T11:57:40.970Z - 20-01-2020

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌పంచంలోనే రెండో ధ‌నిక దేవాల‌యం, ప్ర‌తీ రోజు వేలాది మంది ద‌ర్శించుకునే షిరిడీ క్షేత్రంపై వివాదం రాజుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు పూజించే సాయి బాబా జ‌న్మ‌భూమిపై వివాదం మొద‌లైంది.

సాయిబాబా జ‌న్మ‌భూమిగా ప‌త్రి అనే గ్రామాన్ని పేర్కొంటూ ఆ గ్రామాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఓ నిర్ణ‌యం ఇప్పుడు సామినాథుని భ‌క్తుల్లో చ‌ర్చనీయాంశ‌మైంది. మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయంగానూ ఈ అంశం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

సాయిబాబా న‌డ‌యాడిన, సమాధి అయిన నేల షిరిడీ. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది భ‌క్తులు షిరిడీని పుణ్య‌క్షేత్రంగా భావిస్తుంటారు. నిత్యం ల‌క్ష‌లాధి మంది భ‌క్తులు షిరిడీ వెళ్లి సాయిబాబాను ద‌ర్శించుకుంటుంటారు.

ప్రపంచ‌వ్యాప్తంగా సాయిబాబుకు వేలాది ఆల‌యాలు ఉన్నా షిరిడీకి మాత్రం ప్ర‌త్యేక స్థానం ఉంది. ప్ర‌పంచంలోని ధ‌నిక ఆల‌యాల్లో తిరుప‌తి మొద‌టి స్థానంలో ఉండ‌గా షిరిడీ రెండో స్థానంలో ఉంది. షిరిడీకి భ‌క్తుల రాక రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఒక‌ప్పుడు మామూలు గ్రామంగా ఉన్న షిరిడీ నేడు న‌గ‌రంగా మారింది. రైలు సౌక‌ర్యం, ఎయిర్‌పోర్టు సైతం వ‌చ్చాయి.

కాగా, షిరిడీలోనే సాయిబాబా ఎక్కువ కాలం నివ‌సించి, ఇక్క‌డే స‌మాధి అయ్యార‌నే వాద‌న‌లో ఎక్క‌డా, ఎవ‌రికీ బేదాభిప్రాయాలు లేవు కానీ సాయిబాబా జ‌న్మ‌భూమి విష‌యంలోనే కొంత గంద‌ర‌గోళం ఉంది. ఆయ‌న 16 ఏళ్ల వ‌య‌స్సులో షిరిడీకి వ‌చ్చార‌ని, ఆయ‌న జ‌న్మ‌స్థానం ప‌ర్బ‌నీ జిల్లా ప‌త్రి  అనే గ్రామం అనే ఒక వాద‌న చాలా రోజులుగా ఉంది. షిరిడీకి ప‌త్రి 275 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఇక్క‌డ కూడా ఒక చిన్న సాయిబాబా ఆల‌యం ఉంది.

ప‌త్రికి కూడా భ‌క్తుల రాక రోజురోజుకూ పెరుగుతోంది. కానీ, ఇక్క‌డ క‌నీస సౌక‌ర్యాలు కూడా లేవు. దీంతో ఉద్ద‌వ్ థాక్రే ప్ర‌భుత్వం ప‌త్రి గ్రామంలో సౌక‌ర్యాలు మెరుగుప‌రిచి, అభివృద్ధి చేయ‌డానికి రూ.100 కోట్లు మంజూరు చేయాల‌ని నిర్ణ‌యించింది.

ప‌త్రి సాయిబాబా జ‌న్మ‌భూమిగా ప్ర‌భుత్వం పేర్కొంది. ఇప్పుడు ఇదే వివాదానికి కార‌ణ‌మైంది. ప‌త్రిని షిరిడీ త‌ర‌హాలో అభివృద్ధి చేస్తే షిరిడీకి భ‌క్తుల రాక త‌గ్గుతుంద‌ని షిరిడీతో పాటు చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. ప‌త్రినే సాయిబాబా జ‌న్మ‌భూమిగా ఎటువంటి ఆధారాలు లేవ‌ని షిరిడీ సాయిబాబా సంస్థాన్ అంటోంది.

ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ షిరిడీతో పాటు చుట్టుప‌క్క‌ల 50 గ్రామాలు ఒక్క‌ట‌య్యాయి. రేప‌టి నుంచి షిరిడీ నివ‌ధిక బంద్‌కు స్థానికులు పిలుపునిచ్చారు. గ్రామ‌స్థుల‌తో ఇవాళ స‌మావేశ‌మై షిరిడీ సంస్థాన్ కూడా ఆల‌య మూసివేత ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉండ‌గా సాయిబాబా జ‌న్మ‌భూమి అంశం రాజకీయంగానూ వివాదాస్ప‌దం అవుతోంది. ఉద్ద‌వ్ థాక్రే ప్ర‌భుత్వం అన‌వ‌స‌రంగా ఈ అంశాన్ని వివాదంగా మార్చింద‌ని విప‌క్ష బీజేపీ ఆరోపిస్తోంది. అస‌లు బీజేపీనే షిరిడీవాసుల‌ను రెచ్చ‌గొట్టి ఈ అంశాన్ని వివాదాస్ప‌దం చేస్తోంద‌ని ప్ర‌భుత్వం అంటోంది.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle