‘సామ్నా’తో చిచ్చురేపిన రావత్.. కీలక బాధ్యతల నుంచి ఉద్వాసన..?
21-10-201921-10-2019 18:03:28 IST
2019-10-21T12:33:28.254Z21-10-2019 2019-10-21T12:33:16.715Z - - 20-04-2021

మహారాష్ట్రలో బీజేపీతో పొత్తు శివసేనలో ముసలానికి కారణమయ్యాయన్న వార్తలు వాస్తవమేనని తేటతెల్లం చేసే సంఘటన ఇది. శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన సంజయ్ రావత్ ను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకున్నారు. సంజయ్ రావత్ శివసేనలో ఆషామాషీ నేత కాదు. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాకు సంపాదకుడు కూడా. పార్టీ విధానాలు, సిద్ధాంతాల విషయంలో దిట్ట. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా ఒక రోజు ముందు, ఫలితాల వెల్లడికి నాలుగు రోజుల ముందు సంజయ్ రావత్ ను పార్టీ అధికార ప్రతినిథి హోదా నుంచి తొలగిస్తూ ఉద్ధవ్ థాక్రే తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించిందని చెప్పక మానదు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ-శివసేనల మధ్య పొత్తు కుదిరింది. అయినా ఆ పొత్తుపై...పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాట్లపై శివసేనలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటాయి. గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచీ కూడా శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయాలు మోడీ సర్కార్ పట్ల విమర్శనాత్మక విధానాన్నే కొనసాగించాయి. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయం తరువాత కూడా ఆ ధోరణిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. అయితే ఇది శివసేన పార్టీ విధానంగా అందరూ భావించారు. అయితే సంజయ్ రావత్ ను పార్టీ తరఫున మాట్లాడే అధికార ప్రతినిథుల జాబితా నుంచి తొలగించడంతో పార్టీ విధానాలకు విరుద్ధంగా ఆయన సంపాదకీయాలు ప్రచురించారన్న విషయం నిర్ధారణ అయ్యింది. పార్టీ అభిప్రాయాలను వెల్లడించడం గానీ, ఈ నెల 24న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల సమయంలో ఫలితాల సరళిపై పార్టీ తరఫున స్పందించడానికి కానీ ఇప్పుడు సంజయ్ రావత్ కు అవకాశం లేదు. అదే సమయంలో ఆయన సామ్నా సంపాదకుడిగా కొనసాగే అవకాశాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీతో శివసేనతో పొత్తు ఖరారైన తరువాత, అంతకు ముందు కూడా సమ్నాలో బీజేపీ విధానాలు, నాయకులపై తీవ్ర విమర్శలతో వ్యాసాలు, కథనాలు ప్రచురితమయ్యాయి. అంతే కాకుండా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఇవి సహజంగానే కమల నాథులకు రుచించలేదు. దీంతో పొత్తు సమయంలో సమ్నా ప్రచురణలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు శివసేన వర్గాలే చెబుతున్నాయి. అప్పట్లోనే సంజయ్ రావత్ కు ఉద్వాసన తప్పదని అంతా భావించారు. అయితే పార్టీలో బీజేపీతో పొత్తుపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో సంజయ్ రావత్ పై చర్య తీసుకుంటే మరింత అసమ్మతి ప్రజ్వరిల్లే అవకాశం ఉందన్నే భావనతోనే ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకూ శివసేన అధినేత గుంభనంగా వ్యవహరించారన్న భావన వ్యక్తం అవుతోంది. ప్రచారం గడువు ముగియగానే ముందుగా సంజయ్ రావత్ ను పార్టీ అధికార ప్రతినిథిగా తొలగించారు. రానున్న రోజులలో ఆయన సామ్నా సంపాదక బాధ్యతల నుంచి కూడా వైదొలగే అవకాశం ఉంది. వాస్తవానికి మీడియాలో బీజేపీ పాలనా తీరుపైనా, మోడీ విధానాలపైనా వచ్చే విమర్శలలో అత్యంత పదునుగా ఉండేవి సామ్నా కథనాలే. బీజేపీకి మిత్రపక్షమైనా కూడా మహారాష్ట్రలోనే కాదు, కేంద్రంలో కూడా విపక్షం పాత్ర పోషించినది సామ్నా సంపాదకీయాలేనని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో సంజయ్ రావత్ ను శివసేన అధికార ప్రతినిథి హోదా నుంచి తప్పించడంతో...ఇక సామ్నాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శనాత్మక కథనాలు వెలువడే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్
12 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
12 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
16 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
18 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
13 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
20 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
20 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
13 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
21 hours ago
ఇంకా