newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సరిహద్దులు క్లోజ్... ప్రయాణికులపై ఆంక్షలు

16-03-202016-03-2020 10:21:26 IST
2020-03-16T04:51:26.039Z16-03-2020 2020-03-16T04:51:16.658Z - - 11-04-2021

సరిహద్దులు క్లోజ్... ప్రయాణికులపై ఆంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. విదేశీయుల రాక, వీసాల జారీపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా పొరుగుదేశాల సరిహద్దులు మూసివేస్తూ నిర్ణయం వెలువరించింది. ఇండో-బంగ్లాదేశ్‌, ఇండో-నేపాల్‌, ఇండో-భూటాన్‌, ఇండో-మయన్మార్‌ సరిహద్దుల వెంబడి అన్ని రకాల ప్రయాణికులపై నిషేదాజ్ఞలు విధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇండో-పాక్‌ సరిహద్దు మూసివేత నిర్ణయం అమల్లోకి వచ్చింది.

ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా నడుం బిగించింది. అమెరికా వీసాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. మార్చి 16 నుంచి అమెరికా వీసాల జారీ నిలిపివేయాలని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే వీసాల జారీని నిలిపివేసింది. ఇండియా కూడా విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు కొనసాగిస్తోంది. ఏప్రిల్ 15 వరకు టూరిస్ట్ వీసాలను రద్దు చేసింది. మార్చి 13వ తేదీ నుంచి టూరిస్ట్ వీసాల సస్పెన్షన్ నిర్ణయం అమలులోకి వచ్చింది. కేవలం అధికారిక పర్యటనలు, దౌత్యపరమైన వీసాలు, కొందరు వీఐపీల వీసాలకు మాత్రమే ఈ సమయంలో పర్యటించే అవకాశం ఉంది. 

ఇటు కరోనా వైరస్‌తో ఇరాన్ వణుకుతున్న వేళ అక్కడ ఇరుక్కుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది. టెహరాన్, షిరాజ్ నగరాల నుంచి 53 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరంలోని ఆర్మీ వెల్‌నెస్ సెంటరుకు తరలించారు. ఇరాన్ నుంచి వచ్చిన 52 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడికి విమానాశ్రయంలోనే వైద్యపరీక్షలు చేసి వారిని ఆర్మీ వెల్‌నెస్ సెంటరుకు తరలించారు. ఇరాన్ దేశం నుంచి 389 మంది భారతీయులను నాలుగు విడతలుగా స్వదేశానికి తరలించామని, దీనికి సహకరించిన ఇరాన్ దేశ అధికారులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

అక్కడ ఆలయాల్లోకి నో ఎంట్రీ 

జ్వరంతో బాధపడేవారికి తమిళనాడులోని కొన్ని ఆలయాల్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. శ్రీరంగం రంగనాథర్‌స్వామి ఆలయ అధికా రులు, ఆరోగ్యశాఖ సిబ్బంది సంయుక్తంగా ఆలయానికి వచ్చే భక్తులకు థర్మల్‌ స్కానర్‌ తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. . 99 డిగ్రీ జ్వరంతో ఉండే భక్తులకు ప్రత్యేక వైద్యచికిత్స అందిస్తున్నామన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు చేతులను శుభ్రపరచు కొనే ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న భక్తులు ఆల యానికి రావొద్దని ఆయన సూచించారు. భక్తులు తమకు సహకరించాలని కోరారు. ఎక్కువమంది ఒకేచోట గుమిగూడి వుండవవద్దన్నారు. ఇటు ఏపీలోని తిరుమల ఆలయంలో భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తిరుమలకు భక్తుల తాకిడి తగ్గింది. 

ఇటు చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం‌ అనిమిగానిపల్లిలో కరోనా‌‌ లక్షణాలు కొందరికి ఉన్నాయని తెలియడంతో జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. కుప్పంలో అనిమిగానిపల్లి గ్రామంలో సుమారు మూడు వందలమంది దాక జాతకాలు చెప్పడానికి‌ ప్రతి ఏటా మలేషియా దేశానికి వెళతారు.

ఆరు నెలలకు‌ ఒకసారి సొంత గ్రామానికి వచ్చి వెళ్తుంటారు.ఈ క్రమంలో గత పదిరోజులలో పన్నెండు మంది సొంత గ్రామానికి చేరుకున్నారు‌. మలేషియా నుండి వచ్చినవారిలో ఇద్దరికి దగ్గు గొంతునొప్పి రావడంతో స్థానిక వైద్య సిబ్బందికి గ్రామస్థులు సమాచారం ఇచ్చారు.అయితే వైద్యపరీక్షలకు వారు నిరాకరించడంతో గ్రామస్థులు నచ్చచెప్పి  వైద్య పరీక్షలు చేయడానికి బెంగుళూరు నుండి స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించారు. మరో 15 మంది మలేషియా నుండి అనిమిగానిపల్లి గ్రామానికి రానుండడంతో వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   11 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle