newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

సభా విశ్వాసం పొందిన యడ్యూరప్ప

29-07-201929-07-2019 12:29:38 IST
Updated On 29-07-2019 12:32:22 ISTUpdated On 29-07-20192019-07-29T06:59:38.097Z29-07-2019 2019-07-29T06:59:36.085Z - 2019-07-29T07:02:22.384Z - 29-07-2019

సభా విశ్వాసం పొందిన యడ్యూరప్ప
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యడ్యూరప్ప కల నెలవేరింది. మళ్లీ కర్నాటక సీఎం పీఠంపై కూర్చోవాలని భావించిన ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. కుమారస్వామి కుర్చీని కూలదోసి మళ్ళీ కర్నాటక కమలం వికసించేలా చేశారు. సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో యడ్యూరప్ప సర్కార్‌కు అనుకూలంగా 106.. వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి.

దీంతో కర్నాటకలో కొత్త సర్కార్ కొలువుతీరినట్టయింది. 106 మంది సభ్యులు ఓటేయడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ను యడ్యూరప్ప సునాయాసంగా గట్టెక్కగలిగారు. సభకు కాంగ్రెస్‌-బీజేఎస్‌ సభ్యులు కూడా హాజరయ్యారు. వీరంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ..  విశ్వాస పరీక్షలో సర్కార్‌ విజయం సాధించింది.

బీజేపీకి ఉన్న 105 మందితో పాటు ఓ స్వతంత్ర  ఎమ్మెల్యేతో కలుసుకుని బలం 106కి చేరింది. దీంతో మేజిక్‌ ఫిగర్‌ 104 కంటే రెండు ఓట్లను ఎక్కువగా సాధించి బలపరీక్షలో గెలుపొందారు యడ్యూరప్ప. దీంతో కర్నాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముగిసిపోయింది. 

మూజువాణి పద్దతిలో స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ఓటింగ్‌ను చేపట్టారు. ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విజయం సాధించిందని స్పీకర్‌ ప్రకటించారు.

అనంతరం సీఎం యడియూరప్ప సభలో సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజల విజయమన్నారు. తమ పాలను ప్రధాని మోదీ దిక్సూచీ అన్నారు సీఎం యడ్యూరప్ప. మరోవైపు మాజీ సీఎం సిద్ధరామయ్య..  ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని యడ్యూరప్పకు సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎంతో చేశాయని ఆయన గుర్తుచేశారు.

చెదిరిన ‘కుమార’స్వప్నం ..నెగ్గిన యడ్యూరప్ప పంతం


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle