newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

సన్నీడియోల్‌కు చెమటలు పడుతున్నాయా?

14-05-201914-05-2019 07:51:14 IST
Updated On 28-06-2019 12:34:45 ISTUpdated On 28-06-20192019-05-14T02:21:14.554Z14-05-2019 2019-05-14T02:13:27.843Z - 2019-06-28T07:04:45.445Z - 28-06-2019

సన్నీడియోల్‌కు చెమటలు పడుతున్నాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ పార్లమెంట్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ‌ద్దర్ ఫేం స‌న్నీ డియోల్ గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్నార‌ట‌. ఆయ‌న మీద కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ, లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ బ‌ల‌రాం జ‌క్కర్ కుమారుడు సునీల్ జ‌క్కర్ బ‌రిలో ఉన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పీట‌ర్ మాసిష్ పోటీ చేస్తున్నారు. 

గురుదాస్ పూర్ ఎంసీ సీటు మొద‌టి నుంచీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది. అయితే 1998లో ఈ సీటు నుంచి పోటీ చేసిన న‌టుడు వినోద్ ఖ‌న్నా బీజేపీ టిక్కెట్ మీద గెలిచారు. ఆ త‌ర్వాత 2004, 2014 ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న ఈ సీటు నుంచి విజ‌యం సాధించారు. అయితే 2017 ఏప్రిల్ 27వ తేదీన ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో, గురుదాస్ పూర్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జ‌రిగింది. 

ఆ ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జ‌క్కర్ గెలిచారు. ఈ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన పోటీ ఎదుర్కొంటున్నారు బీజేపీ అభ్యర్థి స‌న్నీ డియోల్. అయితే ఆయ‌న ప్రత్యర్థుల నుంచి పోటీతో పాటు, సొంత పార్టీ నేత‌ల‌తో కూడా ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. త‌మ‌కు కాద‌ని బ‌య‌ట వ్య‌క్తికి టిక్కెట్ ఇవ్వడంపై స్థానిక బీజేపీ నేత‌లు గుర్రుగా ఉన్నార‌ట‌. 

అంతేకాదు, ఈ సీటు నుంచి టిక్కెట్ ఆశించి, భంగ‌ప‌డ్డ వినోద్ ఖ‌న్నా స‌తీమ‌ణి క‌వితా ఖ‌న్నా కూడా ప్రచారానికి దూరంగా ఉన్నార‌ట‌. ఇక గురుదాస్ పూర్ ఎంపీ సీటులో హిందువులు, సిక్కుల ఓట్లు దాదాపు స‌మానంగా ఉన్నాయి. మొన్నటి పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గురుదాస్ పూర్ పార్లమెంట్ సీటు ప‌రిధిలోని మొత్తం 9 అసెంబ్లీ సీట్లలో 7 చోట్ల కాంగ్రెస్, ఒక సీటులో అకాళీద‌ళ్, మ‌రో సీటులో బీజేపీ గెలిచాయి. 

ఇదే త‌మ‌కు క‌ల్సొచ్చే అంశ‌మ‌ని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే తాజా ప‌రిణామాలు ఆ పార్టీకి అంత‌గా అనుకూలంగా లేవ‌ని తెలుస్తోంది. ఇప్పటికే యువ‌త ఓట్లు, అందులో మ‌హిళ‌లు, యువ‌తుల ఓట్లు సన్నీ డియోల్ వైపు ఉన్నాయ‌ట‌.

ఎందుకంటే ఆయ‌న ప్రచారంలో యువ‌తులు పోటీ ప‌డి ముద్దులు పెడుతున్నార‌ట‌. ఇక స‌న్నీ కూడా తన‌ను గెలిపిస్తే, నిరంత‌రం జ‌నానికి అందు బాటులో ఉంటాన‌ని హామీ ఇస్తున్నారు. ఏతావాతా తేలింది ఏంటంటే, సొంత పార్టీ పోరు నుంచి స‌న్నీ డియోల్ బ‌య‌ట‌ప‌డితే గురుదాస్ పూర్ సీటు ఆయ‌న వ‌శం కావ‌డం సులువేన‌ట‌.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle