newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సంప్రదాయంలో మెరిసి మురిసిన అమెరికన్ ఫస్ట్ లేడీ

25-02-202025-02-2020 08:44:36 IST
Updated On 25-02-2020 08:44:22 ISTUpdated On 25-02-20202020-02-25T03:14:36.469Z25-02-2020 2020-02-25T03:13:37.284Z - 2020-02-25T03:14:22.975Z - 25-02-2020

సంప్రదాయంలో మెరిసి మురిసిన అమెరికన్ ఫస్ట్ లేడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసలే ఆమె అగ్రరాజ్యానికి ఫస్ట్ లేడీ.. అధ్యక్షుడు ట్రంప్ భార్య ఇక చెప్పేదేముంది. భారత పర్యటనలో మెలానియా ట్రంప్ మెరిసిపోయారు. ఒకప్పటి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ మెలానియా ట్రంప్‌ భారత్‌ పర్యటన సందర్భంగా  సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఆమె ఎలా వుంటారో, ఆమె ఆహార్యం ఎలా వుంటుందోనని భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అమెరికా నుంచి అహ్మదాబాద్‌కి వచ్చిన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం నుంచి మెలానియా తనకు ఎంతో ఇష్టమైన తెలుపు రంగు దుస్తుల్లో ఒక రాజహంసలా కిందకి దిగారు.

https://www.photojoiner.net/image/4cGD9yHf

తెల్లని జంప్‌ సూట్‌ ధరించి నడుం చుట్టూ ఆకుపచ్చని రంగు సాష్‌ అందంగా చుట్టుకున్నారు. ఆమెను చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపించారు. భారత సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా డిజైనర్లు రూపొందించిన డ్రెస్ ధరించి అందరి మెప్పు పొందారు. జుట్టును లూజ్‌గా వదిలేసి అతి కొద్దిగా మేకప్‌ వేసుకొని తన సహజ సౌందర్యంతోనే ఆమె మెరిసిపోయారు. స్వయంగా ఫ్యాషన్‌ డిజైనర్‌ కావడంతో మెలానియా సాధారణంగా తన దుస్తుల్ని తానే డిజైన్‌ చేసుకుంటారని అంటారు.

భారత్‌ పర్యటన కోసం ప్రముఖ ఫ్రెంచ్‌ అమెరికన్‌ డిజైనర్‌ హెర్వ్‌ పెయిరె డిజైన్‌ చేసిన సూట్‌ని ధరించారు. మెలానియా ధరించిన డ్రెస్‌పై ట్విటర్‌లో ప్రశంసలు కురిశాయి. కొందరు సరదా కామెంట్లు చేశారు. ఈ ప్రేమ జంట తాజ్ మహల్ చుట్టూ విహరించారు. తాజ్‌మహల్‌ అందాలను ఆస్వాదించారు ట్రంప్ దంపతులు. అంతేకాదు తాజ్ అందానికి దాసోహం అయ్యారు.

అమెరికా ఇతర అధ్యక్షుల్లా మాదిరి కాదు.. ట్రంప్, మెలానియా ఎక్కడికి వెళ్లినా చేతులు పట్టుకొని కనిపించరు. కానీ ఈ తాజ్‌ ఏ మాయ చేసిందో ఏమో మెలానా చేతిలో చెయ్యి వేసుకుంటూ తాజ్‌ ఉద్యానవనంలో కలియతిరుగుతూ అలౌకికమైన ఆనందానికి లోనయ్యారు ట్రంప్‌. ఆ తన్మయత్వంలోనే సందర్శకుల పుస్తకంలో తాజ్ ని పొగుడుతూ.. ‘‘తాజమహల్‌ వావ్‌ అనిపించింది. సుసంపన్నమైన, విలక్షణ విభిన్నమైన భారతీయ సంస్కృతికి ఈ కట్టడం కాలాతీతంగా నిలిచిన పవిత్ర శాసనం. థాంక్యూ ఇండియా’’అని రాశారు.

ప్రేమకు చిహ్నమయిన తాజ్ మహల్ చెంత ట్రంప్-మెలానియా, ఇవాంకా-జేర్డ్ కుష్నర్ల జంట ప్రేమ పావురాల్లా విహరించారు. ఇతర ప్రతినిధుల బృందంతో పాటు ఇవాంకా కూడా తాజ్ అందానికి ఫిదా అయ్యారు. తాజ్‌ అందాలను ఇవాంకా తన మొబైల్‌ ఫోన్లో బంధిస్తూ కనిపించారు. తాజ్ ముందు ఇవాంకా సెల్పీ వీడియో తీసుకున్నారు. మొత్తం మీద ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ అమెరికా అధ్యక్షులు ట్రంప్ కు బాగా నచ్చేసింది. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle