newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సంపన్నులే తప్ప సామాన్యులు పట్టరా? – కేంద్రం తీరుపై విమర్శలు

11-09-202011-09-2020 17:14:19 IST
2020-09-11T11:44:19.567Z11-09-2020 2020-09-11T11:44:16.686Z - - 12-04-2021

సంపన్నులే తప్ప  సామాన్యులు  పట్టరా? – కేంద్రం తీరుపై  విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిన్న,మధ్య తరగతి వేతన జీవులు మారటోరియం పొడిగింపు కావాలని కోరుకుంటున్నారు. అది కూడా వడ్డీ లేకుండా! కార్పొరేట్‌ సంస్థలు, వ్యాపారులు నష్టపోతే,  అన్ని విధులగా ఆదుకునే సర్కార్ సామాన్యులకు మాత్రం ఎటువంటి చేయూత ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. వేతన జీవులకు ఊరట కలిగేలా మారటోరియం కాలంలో వడ్డీపై మినహాయింపు ఇవ్వాలన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచనను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదు.

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, వేతనాలలో కోతలకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఇప్పుడు తక్షణ సమస్యగా తీసుకున్న రుణాలకు ఈఎమ్ఐలు చెల్లించడం. అయితే వారికి ఊరట కలిగేలా ఈఎమ్ఐలపై కేంద్రం మారటోరియం విధించింది. ఈ మారటోరియం గడువు కూడా  తీరిపోవచ్చింది.

అయితే మారటోరియం కాలంలో వడ్డీల చెల్లింపు విషయంలో మాత్రం కేంద్రం ఇంత వరకూ స్పష్టత  ఇవ్వలేదు. సుప్రిం సూచనలను కూడా పట్టించుకోవడం లేదు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికి పోయిన ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం ఏ విధంగానూ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నది. మారటోరియం విధించి ఈఎమ్ఐల చెల్లింపులు వాయిదా వేశారు అంతే, వాయిదా వేసిన కాలానికి కూడా వడ్డీ వసూలు చేయడం ఏ విధంగా చూసినా హేతుబద్ధంగా లేదు.

ఎందుకంటే  లాకడౌన్‌ విధించింది కేంద ప్రభుత్వం. అది  అత్యంత శక్తిమంతమైన విపత్తుల చట్టం, సాంక్రమిక వ్యాధుల చట్టం చేతిలో ఉన్నది. వడ్డీ వసూలు వద్దు అని బ్యాంకులను ఆదేశంచలేరా అని సుప్రీంకోర్టు సాక్షాత్తూ సుప్రీం వేసిన ప్రశ్నకు కూడా కేంద్రం సమాధానం ఇవ్వడం లేదు, ఆత్మ నిర్భర్ పేరుతో రెండు లక్షల కోట్ల దాకా ఖర్చు పెడతామని ప్యాకేజి ప్రటించినా, ప్రజలకు, రాష్ట్రాలకు అది ఏ విధంగానూ అక్కరకు వచ్చినట్లు  కనబడదు. రాలేదు.

కరోనా కట్టడుల వల్ల ఇబ్బందుల పాలైన వారికి నేరుగా సహాయం అందించే ప్రయత్నాల జోలికే కేంద్రం పోవడం లేదు. సరిహద్దు ఘర్షణలు, చైనాతో ఉద్రిక్తతలు వంటి ఉదంతాలు ప్రజల దృష్టిని లాక్ డౌన్ కష్టాల నుంచి మరలుస్తాయన్న భావనతో కేంద్రం ఉన్నట్లు కనిపిస్తున్నది. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కరోనా కష్టాలకు కారణం దేవుడే అంటూ చేతులెత్తేసిన కేంద్రం...ఆ దైవ ఘటన వల్లే జనం ఇబ్బందుల్లో పడ్డారు కనుక వారు కూడా చెల్లింపుల విషయంలో చేతులెత్తేయవచ్చా? మారటోరియం కాలంలో వడ్డీలను కట్టడం తమ పని కాదని వారు భావిస్తే కేంద్రం మద్దతిస్తుందా? కేంద్రం ప్రజల సమస్యలు, కరోనా లాక్ డౌన్ కారణంగా ఎదురైన ఆర్థిక కష్టాలను తీర్చాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ప్రజాగ్రహానికి గురి కావడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించదు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle