newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

సంఘ్ బాసటతో రాజస్థాన్‌లో నెగ్గుకొస్తుందా?

07-05-201907-05-2019 07:44:24 IST
2019-05-07T02:14:24.554Z07-05-2019 2019-05-07T02:14:13.995Z - - 26-08-2019

సంఘ్ బాసటతో రాజస్థాన్‌లో నెగ్గుకొస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చేదు అనుభ‌వం  మిగ‌ల్చడంతో, రాజ‌స్థాన్ బీజేపీ నేత‌లు సంఘ్ ఆస‌రా కోరార‌ట‌. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో సంఘ్ స‌ల‌హాల‌ను పాటించ‌క‌పోవ‌డం, అభ్యర్ధుల ఎంపిక‌ను ఏక‌ప‌క్షంగా తీసుకుని దెబ్బతింది బీజేపీ. అందుకే ఈ పార్లమెంట‌రీ ఎన్నిక‌ల‌ను సంఘ్ సూచ‌న‌ల‌తో కార్యాచ‌ర‌ణ నిర్వహించింద‌ట‌. రాజ‌స్థాన్ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శాఖ‌లు 4 వేలు ఉన్నాయి. 

ప్రతి పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో 50 మంది చొప్పున సంఘ్ కార్యక‌ర్తలు బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశార‌ట‌. రాజ‌స్థాన్ రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట‌రీ సీట్లలో గ్రామ‌స్థాయి నుంచీ ప్రచారం చేసిన సంఘ్ ప‌రివార్, ఓట‌ర్లను నాలుగు విభాగాలుగా విభ‌జించి, త‌మ వ్యూహాన్ని అమలు చేశార‌ట‌. మొద‌టి విభాగంలో బీజేపీ కార్యక‌ర్తలు, సంఘ్ కార్యర్తలు, అభిమానులు, బీజేపీ ఓట‌ర్లు ఉంటే, రెండో విభాగంలో మోడీ అభిమానులు, బీజేపీ సానుభూతిప‌రులు ఉన్నార‌ట‌. 

వీరితో అడ‌పాద‌డ‌పా మంత‌నాలు జ‌రిపిన సంఘ్ కార్యక‌ర్తలు, మూడో విభాగంలో ఉన్న వారితో దాదాపుగా మూడు రోజ‌ల‌కు ఒక‌సారి నేరుగా క‌ల్సి మాట్లాడే ప్రయ‌త్నం చేశార‌ట‌. మూడో విభాగం అంటే, ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌రిస్థితులకు అనుగుణంగా ఓట్లే వేసే ప్రజ‌లు. ఈ విభాగంలో ఎక్కువ‌గా మ‌ధ్య త‌ర‌గ‌తి వారు ఉన్నార‌ట‌. ఇక నాలుగో విభాగంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట‌ర్లు, సానుభూతి ప‌రుల‌ను ఏమాత్రం క‌ల‌వ‌లేద‌ట‌. 

ఎందుకంటే వీరితో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవ‌డం ఎందుక‌న్నది సంఘ్ ప‌రివార్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ విధంగా మొత్తం 25 పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక‌ర్తల‌తో పాటు దాని 40 అనుబంధ సంస్థ‌ల కార్యక‌ర్తలు బీజేపీ కోసం తీవ్రంగా క‌ష్టప‌డ్డార‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే, ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌క ముందే సంఘ్ ప‌రివార్ త‌న కార్యాచ‌ర‌ణ రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి మార్చి దాకా ప్ర‌ణాళిక అమ‌లు చేసింది. 

మొత్తం మూడు ద‌శ‌ల్లో ప్ర‌చారం చేసిన సంఘ్ కార్యక‌ర్తలు, మొద‌టి ద‌శ‌లో స‌మావేశాలు నిర్వహించ‌డం, రెండో ద‌శ‌లో క‌ర‌ప‌త్రాలు పంచ‌డం, మూడో ద‌శ‌లో ఏరియాల వారీగా ప్రజ‌ల‌తో మాట్లాడ‌టం చేశార‌ట‌. ఇక సోష‌ల్ మీడియా ద్వారా కూడా బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసి, ఓట‌ర్లను ఆక‌ట్టుకునే య‌త్నం చేసింది సంఘ్ ప‌రివార్. ఆర్ఎస్ఎస్ ప్రచారం చూస్తుంటే త‌మ‌కు ఓ ద‌శ‌లో భ‌యం కూడా వేసింద‌నీ రాజ‌స్థాన్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సురేష్ చౌద‌రి చెప్పారంట్ సంఘ్ ఏ రేంజిలో క‌ష్టప‌డిందో అర్థం అవుతోంది. 

ఎందుకంటే వ‌సుంధ‌ర రాజె అధికారంలోకి రావ‌డానికి అప్పటి ఎన్నిక‌ల స‌మ‌యంలో సంఘ్ ప‌రివార్ చేసిన కృషే కార‌ణ‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు. అందుకే ఈ పార్లమెంట‌రీ ఎన్నిక‌లు త‌మ పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయ‌ని అంటున్నారు. 2014 పార్లమెంట‌రీ ఎన్నిక‌ల్లో మొత్తం 25 సీట్ల‌ను బీజేపీ కైవ‌లం చేసుకుంది. ఈసారి అంత‌గా కాక‌పోయినా, కనీసం 18 సీట్లకు పైగా గెల్చుకోవాల‌న్నదే బీజేపీ ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle