newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శివసేన vs కంగన...మహారాజకీయం?

10-09-202010-09-2020 17:19:42 IST
2020-09-10T11:49:42.809Z10-09-2020 2020-09-10T11:49:38.915Z - - 15-04-2021

శివసేన vs కంగన...మహారాజకీయం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఉనికిపై అనుమానాలు బలపడేలా నటి కంగన వ్యవహారంలో వరుసగా జరుగుతున్న పరిణాలాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఓ అంశంపై గొంతెత్తిన నటి కంగనారనౌత్‌ కార్యాలయాన్ని కూల్చేయడం ప్రతీకారచర్యగా తప్ప మరోలా భావించజాలం. తమకు ఎవరూ ఎదురు తిరగరాదన్న నిరంకుశ విధానంతో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనడానికి కంగన ఉదంతానికి మించిన ఉదాహరణ ఉండదు.   

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న అనుమానాస్పద స్థితిలో మరణించి నప్పటి నుంచి రాజుకుంటున్న వివాదం అనేకానేక మలుపులు తిరిగి చివరకు మంగళవారం అతని స్నేహితురాలు, నటి రియా చక్రవర్తి అరెస్టుకు దారితీసింది. అది జరిగిన మరునాడే నటి కంగనా రనౌత్‌ నివాసం ఆవరణలో అనుమతుల్లేని నిర్మాణాలున్నాయంటూ బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) కూల్చివేతలు మొదలు పెట్టింది.

ముంబై హైకోర్టు ఆదేశాలతో మధ్యలో అవి నిలిచి పోయినప్పటికీ, అసలు హడావుడిగా కంగనా నివాసాన్ని కూల్చివేయడానికి బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎందుకు ఒడిగట్టిందన్న ప్రశ్నకు అందరి చూపూ శివసేన నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం వైపే మళ్లుతోంది. మామూలుగా అయితే కూల్చివేత ఘటన ఇంత వివాదానికి కారణమై ఉండేది కాదు. 

గతంలో షారుఖ్‌ ఖాన్‌, సోనూసూద్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖుల నివాసాల్లో సైతం బీఎంసీ అక్రమ నిర్మాణాల పేరిట కొన్నింటిని కూల్చివేసింది. అయితే ఇప్పుడు కంగనా కార్యాలయ కూల్చివేత నాటి కూల్చివేతలకు భిన్నం. ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం కంగన ముంబై పోలీసులపైనా, శివసేనపైనా తీరవ వ్యాఖ్యలు చేసింది. సుశాంత్‌సింగ్‌ కేసులో ముంబై పోలీసుల వ్యవహారశైలిని ఆక్షేపిస్తూ ఆ నగరాన్ని కంగనా పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చారు. ఇక్కడ జీవనం సాగించాలంటే భయంగా వుందని వ్యాఖ్యానించారు.

అందుకు జవాబుగా శివసేన సైతం ఆమెపై నోరు పారేసుకుంది. దాంతో తన ప్రాణాలకు ముప్పు వై ప్లస్‌ సెక్యూరిటీ కూడా సాధించుకున్నారు. ఈ నేపథ్యంలోనే  కంగనా బంగ్లాలో కొన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయని బీఎంసీ గత సోమవారం ఆమెకు నోటీసులు జారీ చేసింది. నిజానికి అలాంటి అక్రమాలే ఉంటే ఇంతకాలం ఎందుకు మిన్నకున్నదన్న ప్రశ్నకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సమాధానం చెప్పాలి.

కూల్చివేతల నేపథ్యంలో కంగనా రనౌత్ మహా సీఎం ఉద్ధవ్ థాక్రేపైనా, శివసేన సర్కార్ పైనా చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆమె త్వరలో రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందన్న సంకేతాలను ఇస్తున్నాయి. ఏది ఏమైనా కంగనా రనౌత్ నివాసం కూల్చివేత వ్యవహారంలో శివసేన తీరు విమర్శలకు తావిస్తున్నదనడంలో సందేహం లేదు.  

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle