newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శివసేన మెలికతో బీజేపీలో ‘మహా’ సంకటం!

27-10-201927-10-2019 09:00:39 IST
2019-10-27T03:30:39.097Z27-10-2019 2019-10-27T03:30:30.634Z - - 22-04-2021

శివసేన మెలికతో బీజేపీలో ‘మహా’ సంకటం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మహారాష్ట్రలో బీజేపీకి కొత్త తలనొప్పి ఎదురైంది. తాజా అసెంబ్లీ ఎన్నికలలో బలం తగ్గిందన్న బాధ ఒకటైతే...మిత్రపక్షం శివసేన అధికార పంపకం విషయంలో పెట్టిన మెలిక మరోకటి. 50-50 ఫార్మూలా అంటూ శివసేన పట్టుబడుతుండటంతో కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా ఒక స్పష్టత రాలేదు. మరో వైపు శివసేన అధికారిక పత్రిక సామ్నా...కూటమి విజయాన్ని ప్రస్తుతిస్తూనే..ఎన్సీపీ, కాంగ్రెస్ లు బాగా పుంజుకున్నాయని పేర్కొనడం కూడా కూటమిలో అంతా సవ్యంగా లేదనడానికి తార్కానంగా చెప్పవచ్చు.

అసలు ఇలాంటి ప్రతిష్టంభన హర్యానాలో ఏర్పడుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అక్కడ దుష్యంత్ చౌతాలాతో ఒప్పందం కుదుర్చుకుని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లూ చేసేసింది. అంతా సవ్యంగా ఉందని భావించిన మహారాష్ట్రలో మాత్రం‘మహా’ సంకటంలో పడింది. 50-50 ఫార్య్ములా ప్రకారం ముందుగా తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని శివసేన పట్టుబట్టడం, ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ శివసేన రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు విడుదల చేయడంతో పరిస్థితి సంక్షిష్టంగా మారింది.

ఇప్పటి వరకూ ప్రభుత్వ ఏర్పాటు విషయంపై శివసేన, బీజేపీల మధ్య చర్యలు మొదలు కాలేదు. శివసనేనను కాదని ముందుకు సాగే అవకాశం బీజేపీకి ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే బలం తగ్గిన సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీంతో శివసేన మెలికతో మహా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికారంలో సమాన వాట కోరుతున్న శివసేన వెనక్కు తగ్గే అవకాశాలేమాత్రం కనిపించడం లేదు. పైపెచ్చు 50-50 ఫార్ములా పై తేలిన తరువాతే...ప్రభుత్వ ఏర్పాటు విషయంపై ముందుకు వెళ్లాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారు.

ఎన్నికలకు ముందు బీజేపీ శివసేనల మధ్య పొత్తు కుదిరినప్పటికీ....అది బలంగా లేదన్న సంకేతాలు అప్పట్లోనే కనిపించాయి. పోత్తుకు నిరసనగా శివసేనలో భారీ స్థాయిలో అసమ్మతి, అసంతృప్తి పెల్లుబికింది. పలువురు రాజీనామాల బాట పట్టారు. శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయాలు బీజేపీ విధానాలను వ్యతిరేకించాయి.

సరిగ్గా పోలింగ్ కు ముందు బీజేపీ అభ్యంతరాలు, ఒత్తిడి కారణంగా సామ్నా  సంపాదకుడు అయిన శివసేన సీనియర్ నాయకుడు రావత్ ను పార్టీ అధికారిక బాధ్యతలనుంచి ఉద్ధవ్ థాక్రే తప్పించారు. అయితే అది ఎన్నికల ముందు వాతావరణం చెడకుండా ఉండేందుకేనని ఫలితాల తరువాత తేటతెల్లం అయ్యింది. 50-50 ఫార్ములా మేరకు ఆదిత్యథాక్రే సీఎంగా ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని శివసేన పట్టుబడుతోంది. సామ్నా సంపాదకీయాలు యథాపూర్వంగా బీజేపీ పట్ల విమర్శనాత్మకంగానే ఉంటున్నాయి.

అసలు థాక్రే కుటుంబం నుంచి తొలి సారిగా ఆదిత్య థాక్రేను బరిలోనికి దింపినప్పుడే శివసేన వ్యూహాలు ఏమిటన్నది అందరికీ అర్ధమయ్యింది. తొలుత ఆదిత్య థాక్రే ఉపముఖ్యమంత్రి అంటూ శివసేన నేతలు ప్రకటనలు చేసినప్పటికీ ఫలితాల తరువాత వారి వాణి, బాణి మారింది. థాక్రే సీఎంగా శివసేన ప్రచారం చేస్తున్నది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ-శివసేన పొత్తుల సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తదుపరి అసెంబ్లీ ఎన్నికలలో 50-50 ఫార్ములా సూత్రాన్ని ప్రతిపాదించినట్లు శివసేన చెబుతోంది.

ఆ మేరకు అప్పట్లో అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారనీ, ఇప్పుడు దానికి కట్టుబడి ఉండాలన్నది శివసేన వాదన. ఇక ఇప్పుడు బీజేపీ ఏ రీతిగా స్పందిస్తుందన్నది ఆసక్తి కరం. ఏది ఏమైనా శివసేన-బీజేపీ కూటమి పూర్తి మెజారిటీ సాధించినా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది తొలిగే వరకూ ప్రభుత్వ ఏర్పాటు పై ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు.

 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle