శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట
19-11-201919-11-2019 10:56:21 IST
2019-11-19T05:26:21.686Z19-11-2019 2019-11-19T05:26:19.373Z - - 14-04-2021

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుండగా వారంరోజుల క్రితం శివసేనలో అంతర్గతంగా జరిగిన కుమ్ములాట గురించి ఇన్ సైడర్లు ఆలస్యంగా స్పందించారు. సేన ఎమ్మెల్యేలలో చాలామంది కాంగ్రెస్, ఎన్సీపీతో చేయి కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సివసేన అధినేత ఉద్దవ్ థాక్రే పట్ల తీవ్ర అసమ్మతని వ్యక్తం చేశారని లేటుగా తెలుస్తోంది శివసేన ఎమ్మెల్యేలలో అసంతృప్తి, అలజడి పరాకాష్టకు చేరుకున్నందువల్లే సేన ఎమ్మెల్యేలను వారు విడిది చేసిన హోటల్ నుంచి వారి వారి ఇళ్లకు పంపేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ పంపిన ఆహ్వానాన్ని మెజారిటీ స్థానాలు సాధించిన అధికార బీజేపీ తిరస్కరించిన తర్వాత శివసేన తన ఎమ్మెల్యేలందరినీ ముంబైలోని ఒక హోటల్‌కి తరలించింది. ఈ హోటల్లో ఉన్న సమయంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు తీసుకోవాలని నాయకత్వం తీసుకున్న వైఖరిని సేన ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. ప్రారంభంలో అసమ్మతి తక్కువగానే ఉండిందని, కానీ రోజులు గడిచేకొద్దీ ఎమ్మెల్యేలలో అశాంతి పెరిగిపోయిందని దీంతో పార్టీ నాయకత్వం వారిని ఇళ్లకు వెళ్లడానికి అనుమతించాలని నిర్ణయించిందని సేన ఇన్ సైడర్లు తెలిపారు. తమ ఎమ్మెల్యేలను ఎక్కడ బీజేపీ ప్రలోభపెట్టి లాగేసుకుంటుందో అన్న భీతితో శివసేన తన 56 మంది ఎమ్మెల్యేలను పశ్చిమ ముంబాయిలోని హోటల్ రిట్రీట్‌కు తరలించింది. వీరిలో 40 మందిపైగా ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసినంత పనిచేశారని సమాచారం. ముూడు దశాబ్దాలకు పైగా పోటీ చేస్తూ ఘర్షణ పడుతూ వచ్చిన వారితో ఇప్పుడు అధికారం కోసం జతకట్టాలని నిర్ణయించుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారు అంటూ ఎమ్మెల్యేలు ఆగ్రహించడమే కాకుండా ఘర్షణ పడ్డారని, ఒకరికొకరు తోసుకున్నారని, పిడిగుద్దులతో పరస్పరం సత్కరించుకున్నారని ఇన్ సైడర్లు తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేనతో పొత్తు కట్టే విషయమై ఏదీ నిర్ణయించుకోని నేపథ్యంలో ఉద్ధవ్ ధాక్రే నేతృత్వంలోని శివసేనలో ఈ అంతర్గత డైలెమ్మా మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
3 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
10 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా