శివసేనకు సీఎం పీఠం.. కాంగ్రెస్-ఎన్సీపీ అంగీకారం
15-11-201915-11-2019 14:25:07 IST
Updated On 15-11-2019 16:56:20 ISTUpdated On 15-11-20192019-11-15T08:55:07.737Z15-11-2019 2019-11-15T08:55:05.707Z - 2019-11-15T11:26:20.853Z - 15-11-2019

మహారాష్ట్ర రాజకీయం మారబోతోందా? తెరమీదకి సంకీర్ణ సర్కార్ యూపీఏ తరహాలో ‘మహా’లో కనీస ఉమ్మడి కార్యక్రమం శివసేనకే ఐదేళ్లు సీఎం పీఠం పదవుల పంపకాలపై కుదిరిన సయోధ్య మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ కు రంగం సిద్ధమయింది. బీజేపీ-శివసేన మధ్య ఫిఫ్టీ-ఫిఫ్టీ బెడిసికొట్టడం, సీఎం పీఠం తనకే కావాలని పట్టుబట్టడంతో బీజేపీ బయటకు వచ్చింది. దీంతో శివసేన కు చుక్కలు కనిపించాయి. చిరకాల వాంఛ అయిన సీఎం పీఠం కోసం అన్ని ప్రయత్నాలు చేసింది సేన. కాంగ్రెస్-ఎన్సీపీలతో దోస్తానా చేసింది. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధం కావడం, శివసేనకు ఐదేళ్ళు సీఎం పదవి ఇవ్వడానికి అంగీకరించడంతో మరో సంకీర్ణం మహారాష్ట్రలో కొలువుతీరనుంది. ఈ మేరకు కనీస ఉమ్మడి కార్యక్రమానికి మూడు పార్టీల అధినేతలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం పదవుల పంపకాలపై కూడా వీరిమధ్య అవగాహన ఒప్పందం కుదిరింది పదవుల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్, ఎన్సీపీకి మండలి చైర్మన్ పదవులు దక్కనున్నాయి. శివసేనకు సీఎంతో పాటు 14 మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, 14 మంత్రి పదవులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎంతో పాటు 12 మంత్రి పదవులు రానున్నాయి. ఈ అవగాహనకు మూడు పార్టీల అధినేతలు ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్, సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం పీఠం ఫిఫ్టీ-ఫిఫ్టీ అని తొలుత ప్రచారం జరిగింది. కానీ శివసేన వైపే కాంగ్రెస్-ఎన్సీపీ అంగీకారం తెలిపాయి. త్వరలో మూడుపార్టీల బృందం మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసి తమ ఒప్పందం గురించి వెల్లడించనున్నారు. రాష్ట్రపతి పాలన అమలులో ఉండగా.. గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఉత్కంఠను రేపుతోంది. మరో రెండురోజుల్లో గవర్నర్ ఎన్సీపీ, శివసేనల మహాశివ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే సీఎం పీఠం విషయంలో శివసేన పట్టుదల నెగ్గినట్టు అవుతుంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా