newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శివసేనకు మద్దతిస్తే మనుగడ కష్టమే.. సోనియా

05-11-201905-11-2019 10:53:06 IST
Updated On 05-11-2019 10:53:02 ISTUpdated On 05-11-20192019-11-05T05:23:06.047Z05-11-2019 2019-11-05T05:22:44.230Z - 2019-11-05T05:23:02.832Z - 05-11-2019

శివసేనకు మద్దతిస్తే మనుగడ కష్టమే.. సోనియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా శివసేనకు మద్దతు నివ్వడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ససేమిరా అన్నారు. మహారాష్ట్ర కురువృద్ధ నేత ఎన్సీపీ చీప్ శరద్ పవార్‌తో సోమవారం సాయంత్రం భేటీ అయిన సోనియాగాందీ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి మారిన పరిస్థితులను అవకాశంగా తీసుకుందామని పవార్ చేసిన సూచనను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో భాగస్వామ్యపక్షం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ సోమవారం ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. అధికారం చేపట్టడానికి శివసేన పంపుతున్న సంకేతాల గురించి పవార్ సోనియాకు వివరించారు. అయితే పవార్ సూచనను సోనియా తిరస్కరించినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. మహారాష్ట్ర కాంగ్రెస్‌లో ఓ వర్గం శివసేనతో చేతులు కలపాలని కోరుతున్నప్పటికీ అది పార్టీ దీర్ఘకాల మనుగడను దెబ్బతీయగలవని సోనియా భావించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. 

బీజేపీని అధికారానికి దూరం పెట్టడానికి శివసేనతో చేతులు కలుపుదామన్నది మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు పృథ్వీరాజ్‌ చవాన్‌, అశోక్‌ చవాన్‌ మొదలైన వారి సూచన. కానీ శివసేనకు మద్దతివ్వడానికి కాంగ్రెస్‌ తాత్కాలిక ఛీఫ్‌ సోనియాగాంధీ విముఖత ప్రదర్శించారు. సోనియాతో చర్చలు ఫలప్రదం కాలేదన్న విషయం కూడా పవార్‌ మాటల్లో స్పష్టమైంది. 

సోనియాతో భేటీ అనంతరం మీడియా ముందుకొచ్చిన పవార్ విపక్షంలో కూర్చోవాలని ప్రజలు ఇచ్చిన తీర్పుకే కట్టుబడతామని స్పష్టం చేశారు. ‘‘విపక్షంలోనే కూర్చోవాలని ప్రజలు మాకు తీర్పునిచ్చారు. ఇప్పటికీ మేం దానికే కట్టుబడి ఉన్నాం. అయితే భవిష్యత్తులో ఏం జరగుతుందన్నది ఊహించి చెప్పలేను. ప్రభుత్వ ఏర్పాటుపై నేను, సోనియా చర్చించలేదు’’ అని ఆయన చెప్పారు. 

అంటే.. శివసేనతో కలవడం సోనియాకు సమ్మతం కాదని తేలిపోయిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బాధ్యత బీజేపీది. కొన్ని రోజులుగా బీజేపీకి వ్యతిరేకంగా శివసేన గళమెత్తుతోంది. సామ్నాలో వ్యాసాలు రాస్తోంది. కానీ అది కాషాయసేన అంతర్గత వ్యవహారం’’ అని పవార్‌ పేర్కొన్నారు. 

మరోవైపు శివసేన-బీజేపీ మధ్య ప్రతిష్ఠంభనకు ఇంకా తెరపడలేదు. శివసేన సీనియర్‌ నేతలు సంజయ్‌ రౌత్‌, రామ్‌దాస్‌ కదమ్‌ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీని కలిశారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరలేదు. సీఎం ఫడణవీస్‌ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చలు జరిపారు. వెంటనే ప్రభుత్వం ఏర్పాటవ్వాల్సిన అవసరముందని ఆయన అన్నారు. 

అయితే, సీఎం పదవిని చెరిసగం కాలం పంచుకోరాదని అమిత్ షా-దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించినట్లు సమాచారం. 9వ తేదీకి అసెంబ్లీ పదవీకాలం ముగిసిపోతుంది. ఆ లోగా సర్కారు ఏర్పాటవ్వాల్సి ఉంది. శివసేన గనక బీజేపీకి మద్దతివ్వకపోతే సేన చీలిపోవడం ఖాయమని స్వతంత్ర ఎమ్మెల్యే రవి రత్నా అన్నారు. 

మరోవైపు నవంబర్ 9లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే తాత్కాలికంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడే ప్రమాదం ఉండటంతో రాజకీయ పక్షాలు అధికార కూటమికి సంబంధించి వేగంగా పావులు కదుపుతున్నాయి.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle