శవాలు మాయం.. గందరగోళం.. ఏమిటీ దుస్థితి?
13-06-202013-06-2020 12:07:35 IST
2020-06-13T06:37:35.450Z13-06-2020 2020-06-13T06:37:06.617Z - - 11-04-2021

దేశంలో కరోనా వైరస్ కారణంగా అయినవాళ్ళను కోల్పోయినవారికి మరో గందరగోళం అయోమయానికి గురిచేస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో ఆస్పత్రి సిబ్బంది కరోనాతో మరణించిన శవాల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించడం వివాదాస్సదం అవుతోంది. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ కోవిడ్-19 ఆస్పత్రిలో.. వార్డుల్లోనే కాదు.. లాబీల్లోనూ కరోనా శవాలు కనిపిస్తున్నాయి. కొన్ని వార్డుల్లో శవాల పక్కనే రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఎల్‌జేఎన్‌పీ ఆస్పత్రిలో తమవాళ్ల మృతదేహాలు తారుమారుయ్యాయని రెండు కుటుంబాలు ఆరోపించాయి. ఆస్పత్రిలో సరైన చికిత్స అందించకపోవడమే కాదు... ఆఖరికి తమవాళ్ల మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేకపోవడం దారుణం అంటున్నాయి. సన్నీ చంద్ర అనే సీఐఎస్ఎఫ్ జవాన్ తండ్రి సంత్ రామ్ అనారోగ్యంతో కన్నుమూశారు. మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది అంబులెన్సులో నిగంబోధ్ ఘాట్ వద్దకు తీసుకొచ్చి మాకు అప్పగించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాం. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే ఆస్పత్రి నుంచి నాకు ఫోన్ వచ్చింది. తనకు అప్పగించిన మృతదేహం మరో మహిళది అని తెలపడంతో మేమంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఆ మహిళ బంధువులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారని సన్నీ చంద్ర అన్నారు. జూన్ 6వ తేదీన ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో తమ తండ్రి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. డెత్ సర్టిఫికెట్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్టు పేర్కొన్నారు. అనంతరం ఓ వస్త్రంలో కప్పి ఉంచిన డెడ్ బాడీని అప్పగించారని.. దానిపై ఉంచిన ఒక పేపర్లో పేరు,వయసు,జెండర్ ఇతరత్రా వివరాలను రాశారు, ముఖం చూసేందుకు అంగీకరించకపోవడంతో అంత్యక్రియలు చేశారు. అయితే ఇంటికి బయలుదేరాక ఆస్పత్రికి రావాలని కోరడంతో అక్కడికి వెళ్లిన సన్నీ చంద్రకు తండ్రి శవం అప్పగించారు. మరో వ్యక్తి తల్లి మృతదేహం విషయంలో అదే జరిగింది. తలనొప్పితో బాధపడుతున్న తల్లి మీరాదేవిని కొడుకు ముఖేష్ మాలవియ నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. కరోనా సోకిందన్న అనుమానంతో అక్కడినుంచి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంబులెన్సుడ్రైవర్ ఆమెను ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. మాలవియ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టులను ఆ అంబులెన్స్ డ్రైవర్‌కే ఇచ్చాను. తీరా ఆస్పత్రికి వెళ్లాక మా అమ్మను ఏ వార్డుకు తీసుకెళ్లారో తెలియలేదు. ఆ రాత్రంతా ఆమె సమాచారం కోసం ఆస్పత్రి సిబ్బందిని అడుగుతూనే ఉన్నాను. కానీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అక్కడి ఆస్పత్రి సిబ్బంది ఆమె ఎక్కడుందో చెప్పలేకపోయారు. 27వ వార్డులో ఉందని తెలిసి ఆమెతో ఫోన్లో మాట్లాడాడు కొడుకు ముఖేష్. ఆమెకు తినడానికి తిండి కూడా లేదని, ఆస్పత్రి సూపరింటెండెంట్ ని ప్రాధేయపడితే డిశ్చార్జి చేస్తామని చెప్పినా పదినిముషాలకే అమ్మ చనిపోయిందని చెప్పడంతో కొడుకు కుప్పకూలిపోయాడు. తల్లి మృతదేహాన్ని అయినా తనకు అప్పగించలేదట. అంబులెన్సుల్లో తల్లి మృతదేహం గురించి వెతికితే అది అది సంత్ రామ్ మృతదేహం అని.. తిరిగి తాము ఆస్పత్రికి వెళ్లి సిబ్బందిని నిలదీయగా.. అప్పటికే తన తల్లి మృతదేహాన్ని పొరపాటున వేరేవాళ్లకు అప్పగించామని చెప్పారన్నారు. అంతేకాదు,అప్పటికే దహన సంస్కారాలు కూడా పూర్తయ్యాయని చెప్పాడు. ఇలా ఒకరి బదులు మరొకరి శవాలు తారుమారయ్యాయి. అందులో కొందరు శవాలకు వేరెవరో దహన సంస్కారాలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని వారంతా వాపోతున్నారు. గాంధీలోనూ అంతే... హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా మృతుడి శవం మాయం కావడం వివాదాస్పదం అయింది. మెహదీపట్నం వాసి ఒకరు చనిపోయారు. అయితే అతడి మృతదేహం కోసం వచ్చిన బంధువులకు డెడ్‌బాడీ కనిపించలేదు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన రషీద్ అలీఖాన్ ఈనెల 9న కరోనా వ్యాధితో ఆస్పత్రిలో చేరాడు. అనంతరం చికిత్స పొందుతూ రషీద్ మృతి చెందాడు. రషీద్ మృతి విషయాన్ని బంధువులకు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే మృతదేహం కోసం బంధువులు ఆస్పత్రికి రాగా మార్చురీలో మృతదేహం కనిపించకుండా పోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మృతదేహం మాయంపై ఆస్పత్రి వర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మృతదేహం మిస్సవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు. దీంతో ఆందోళన వ్యక్తం అయింది. యూపీలో చెత్తబండిలో శవం రానురాను మానవత్వం ఛాయలు మాయం అవుతున్నాయి. యూపీ బలరాంపూర్ జిల్లా మున్సిపాలిటీలో శవాన్ని చెత్తబండిలో వేయడంతో వివాదం రేగింది. సహజ్పురకు చెందిన మహ్మద్ అన్వర్ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కుప్పకూలిపోయాడు. అస్వస్థతతో చనిపోయిన అన్వర్‌కు అంతకుముందు వైద్య సాయం అందించేందుకు ఒక్కరు ముందుకురాలేదు. చనిపోయాక అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి.. మృతదేహాన్ని మున్సిపాలిటీ చెత్తబండిలో తరలించారు. అలా తరలిస్తుండగా కొందరు వీడియో తీశారు. దీనిపై అధికారులు స్పందించారు. మృతదేహాన్ని తరలించిన నలుగురు మున్సిపల్ సిబ్బంది, అక్కడే వున్న ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండయిన వారిలో ఒక ఎస్ఐ కూడా వున్నారు. కరోనా వైరస్ పేషెంట్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని.. ఓ మృతదేహాన్ని చెత్త కుప్పలో పడేయడం ఇందుకు నిదర్శనమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
9 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా