newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శభాష్ నవనీత్ కౌర్.. లోక్ సభలో మాటల తూటాలు

18-11-201918-11-2019 15:58:41 IST
2019-11-18T10:28:41.405Z18-11-2019 2019-11-18T10:28:39.288Z - - 22-04-2021

శభాష్ నవనీత్ కౌర్..  లోక్ సభలో మాటల తూటాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవాళ్టినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే లోక్ సభలో వేడి రాజేశారు నటి, ఎంపీ నవనీత్ కౌర్. మహారాష్ట్ర లోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నవనీత్ కౌర్ తనదైన రీతిలో రైతుల సమస్యలను సభలో లేవనెత్తారు. పనిలో పనిగా శివసేనపై ఆమె విమర్శలు చేశారు. మహారాష్ట్ర రైతుల సమస్యను సభలో ప్రసావించి ఆమె అందరినీ ఆకట్టుకొన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడానికి, ప్రతిష్టంభనకు శివసేన కారణం అంటూ దుమ్మెత్తి పోశారు. 

అయితే, నవనీత్ కౌర్ విమర్శలపై శివసేన సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయితే ఆమె ఎక్కడా తగ్గకుండా ఘాటుగా స్పందించారు. పార్టీల స్వార్థం కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని నవనీత్ కౌర్ అన్నారు.

శివసేన ఎంపీలు సభలో రైతులు గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందన్నారు.  రైతుల సమస్యలు తీరుస్తారని అసెంబ్లీలో వారికి మెజారిటీ ఇచ్చారు. కానీ వాళ్ల స్వార్ధం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని ఆమె అన్నారు.

తనను అడ్డుకునే అవకాశం ఇవ్వనని, రైతు సమస్యల గురించి తనకు బాగా తెలుసన్నారు. అనేక ప్రాంతాలలో తాను పర్యటించానన్నారు. శివసేనకు రైతుల పట్ల ప్రేమ లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను శివసేన నేతలు అడ్డుకున్నారని, మహారాష్ట్రలో పేరుకుపోయిన కరువు, క్షామానికి పరోక్షంగా శివసేన కారణం అన్నారు.  రాష్ట్రంలోని అనేక కరువు జిల్లాలో తాను విస్తృతంగా పర్యటించానని, రైతులు పడుతున్న బాధల్ని పరిశీలించానన్నారు.

సోయాబిన్, కందులు, ఇతర ధాన్యాల పంటలకు సంబంధించి విపరీతమైన నష్టం వాటిల్లింది. వారిని ఆదుకునే నాథుడే లేకుండా పోయాడు. కేంద్రం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు.  తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, పంజాబీ, మలయాళ భాషా చిత్రాల్లో నవనీత్ కౌర్ నటించి మెప్పించారు. మహారాష్ట్రకు చెందిన రవి రాణాను వివాహం చేసుకొని నవనీత్ రాణాగా మారారు. 2019 ఎన్నికల్లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. నవనీత్ కౌర్ ప్రసంగానికి పలువురు ముగ్దులయ్యారు. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle