newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శతాబ్దాల నిరీక్షణ ముగిసినట్లే.. భూమిపూజపై యోగి, మోహన్ భగవత్ మోదం

06-08-202006-08-2020 09:52:22 IST
2020-08-06T04:22:22.098Z06-08-2020 2020-08-06T04:22:12.410Z - - 10-04-2021

శతాబ్దాల నిరీక్షణ ముగిసినట్లే.. భూమిపూజపై యోగి, మోహన్ భగవత్ మోదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన అపరూపం ఘట్టం అయిన రామాలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్విఘ్నంగా జరగటంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సంతోషం పట్టలేకపోయారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది. రామమందిరం భూమి పూజలో పాల్గొనడం మా అదృష్టం. ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా కల సాకారమైంది. ప్రపంచంలోనే అయోధ్య విశిష్ట నగరంగా రూపుదిద్దుకోబోతుంది. ఎందరో త్యాగాల ఫలితమిది అంటూ యోగి చెప్పుకొచ్చారు.

ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ.. దశాబ్దాల కల నెరవేరిందని ఇన్నాళ్లకయినా భవ్యమైన రామమందిర రూపుదద్దుకోబోతోందని ప్రకటించారు. దేశవ్యాప్తంగా దశాబ్ధాల కల నెరవేరిన ఆనందం కనిపిస్తోంది. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. అందరూ ఈ వేదికపై లేకపోవచ్చు.. రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్ర ఎనలేనిది.  రామమందిరం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతాయి. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ద్వేషాలు, పాపాల నుంచి దూరంగా.. సర్వమానవ సమాజం కోసం తమకు తాము తయారుచేసుకోవాలి. విశ్వమానవాళికి మార్గదర్శం చేయదగ్గ భవ్యమైన రామమందిరం రూపుదిద్దుకోబోతుంది అంటూ మోహన్ భగవత్ వెల్లడించారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరిగింది. దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేద మంత్రోచ్ఛరణల నడుమ శంకుస్థాపన చేశారు. గర్భగుడి వద్ద వెండి ఇటుకతో శంకుస్థాపన చేశారు. భూమి పూజకు నక్షత్ర ఆకారంలో ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ప్రవిత్ర నదీ జలాలతో క్రతువు నిర్వహించారు. అయోధ్యలో భూమిపూజకు సమాంతరంగా.. దేశవ్యాప్తంగా రామాలయాల్లో ప్రార్థనలు, పూజలు జరిగాయి. 

బాబ్రీ మసీదు ఉండేది, ఇకపై కూడా ఉంటుంది: ఒవైసీ

రామాలయ నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భారతీయులు ఆసక్తిగా తిలకిస్తున్న వేళ.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎన్నటికీ తుడిచిపెట్టుకు పోదని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరుగుతున్న వేళ ఒవైసీ మరోసారి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. 

‘‘బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, కచ్చితంగా ఉంటుంది కూడా’’అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఒవైసీ గతంలో ప్రధాని మోదీని విమర్శించిన విషయం తెలిసిందే. అదే విధంగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్‌ 6న ఓ క్రిమినల్స్‌ గుంపు ధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించినప్పటికీ తాను బతికున్నంత కాలం బాబ్రీ మసీదు ఎపిసోడ్‌ ముగిసిపోదని హెచ్చరించారు. రామ మందిర భూమి పూజ నిర్వహించకూడదని విజ్ఞప్తి చేశారు.

కాగా అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు స్థలం కేటాయించింది.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle