newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ్యవసాయ బిల్లు.. ఎన్డీఏలో పార్టీ వ్యతిరేకించినా వైసీపీ మాత్రం జై!

18-09-202018-09-2020 17:33:30 IST
2020-09-18T12:03:30.409Z18-09-2020 2020-09-18T12:03:26.083Z - - 22-04-2021

వ్యవసాయ బిల్లు.. ఎన్డీఏలో పార్టీ వ్యతిరేకించినా వైసీపీ మాత్రం జై!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అధికార వైసీపీ.. కేంద్రంలో అధికార బీజేపీ రెండు చోట్ల ప్రతిపక్షాలుగా చెప్పుకుంటాయి. ఏపీలో బీజేపీ నేతలైతే టీడీపీతో ఎంత దూరమో వైసీపీతో అంతే దూరమని చెప్తారు. వైసీపీ నేతలైతే బీజేపీ మాకు ప్రతిపక్షమేనని చెప్తారు. కానీ ఏపీ ఎంపీలు మాత్రం కేంద్రంలో బీజేపీ తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చే బిల్లులకు ఓటేసి ఆమోదిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలోని మిత్ర పక్షాల ఎంపీలు వ్యతిరేకించినా వైసీపీ ఎంపీలు మాత్రం ఆ నిర్ణయాలకు జైకొట్టి ఓటేసి ఆ నిర్ణయాన్ని గెలిపిస్తారు.. బిల్లును ఆమోదిస్తారు.

గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు ఆమోదం తెలపగా ఇప్పుడు ఏకంగా ఎన్డీఏలోని పార్టీలు వ్యతిరేకిస్తున్న బిల్లులకు సైతం ఆమోదం తెలపడం విడ్డురంగా మారింది. అంతేకాదు ఆ బిల్లులను వ్యతిరేకించిన పార్టీలపై బీజేపీ తరపున వైసీపీ నేతలు వకాల్తా పుచ్చుకొని మరీ వెనకేసుకురావడం మరింత ఆశ్చర్యం కలిగించకమానదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వ్యవసాయ సవరణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై చాలా రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉండగా ఈ బిల్లుతో రైతులకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుకు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా బిల్లు కూడా పాస్ చేశారు. ఇక ఏపీలో మాత్రం కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుకు అనుకూలంగా ఇప్పటికే జీవోలు కూడా ఇచ్చేశారు. అందులో భాగంగానే వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుకు రాష్ట్ర వైసీపీ నేతలు ఒక్క మాట మాట్లాడకపోగా అనుకూలంగా వ్యాఖ్యలు కూడా మొదలు పెట్టారు.

కాగా, కేంద్రంలో ఈ బిల్లుకు నిరసనగ ఎన్డీఏ మిత్రపక్షం అయిన అకాలీదళ్ కు చెందిన కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ నుంచి వైదొలిగేందుకు కూడా ఆలోచిస్తున్నామని ప్రకటించారు. అకాలీదళ్ ఎన్డీఏకు కీలక భాగస్వామి పార్టీ. అలాంటి పార్టీ తమ సొంతరాష్ట్రమైన పంజాబ్ లో రైతులకు నష్టం జరుగుతుందని పదవి వదులుకొని కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించగా ఏపీలో రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుండి ఆదేశాలు వచ్చి రాకముందే అమలు చేయాలని జీవో ఇవ్వడాన్ని ఆశ్చర్యం అనుకోవాలో.. విడ్డురం అనాలో.. అన్నిటికి మించి మరేదైనా భయమే అనుకోవాలో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి!

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   12 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   10 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle