newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ్యవసాయ బిల్లులపై ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

24-09-202024-09-2020 13:45:06 IST
Updated On 24-09-2020 13:50:55 ISTUpdated On 24-09-20202020-09-24T08:15:06.150Z24-09-2020 2020-09-24T08:15:02.044Z - 2020-09-24T08:20:55.490Z - 24-09-2020

వ్యవసాయ బిల్లులపై ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కేంద్రం వ్యవసాయ రంగం బలోపేతం, రైతుకు మార్కెట్ స్వేచ్ఛ అంటూ తీసుకువచ్చిన మూడు బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందడంతో రాజకీయ పార్టీలు భగ్గు మంటున్నాయి. వ్యవసాయ భారతం ఆందోళనలతో రగిలిపోతున్నది. రాజకీయ పార్టీలూ రాజ్యాంగ విరుద్ధంగా బిల్లులను కేంద్రం పార్లమెంటులో ఆమోదింప చేసుకుందనీ, ఇవి చట్ట రూపం దాలిస్తే దేశంలో రైతు కుదేలు కావడం ఖాయమనీ విమర్శలు గుప్పిస్తుండగా, దేశ వ్యాప్తంగా రైతులు బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షం అకాలీ దళ్ కూటమి నుంచి వైదొలిగితే...ఇతర పక్షాలు మింగలేక కక్కలేక అన్న చందంగా ఉన్నాయి. ఆఖరికి బీజేపీకి మెంటార్ గా వ్యవహరించే ఆర్ఎస్ఎస్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నది.

ఇంతగా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఆ బిల్లులేమిటి? వాటి వల్ల రైతులకు ఒనగూరే నష్టమేమిటి? ఈ బిల్లులు చట్టరూపం దాలిస్తే లాభపడేదెవరు? రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? అన్న విషయాలను అవలోకిస్తే...ముందుగా నిత్యావసర సరుకుల సవరణ బిల్లు,  ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్షన్, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాయి. ఈ బిల్లులు చట్ట రూపం దాలిస్తే దేశంలో రైతుల జీవితాల్లో వెలుగులు పూస్తాయిని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే...వారి జీవితాలు అంధకార బంధురమౌతాయని విపక్షం గగ్గోలు పెడుతోంది. వాస్తవానికి ఈ బిల్లుల వల్ల రైతులకు నిజంగా ప్రయోజనం ఉంటే...తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చినందకు రైతులు పండుగ చేసుకుని ఆ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకాలు చేశారు.

అయతే కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుల విషయంలో దేశంలో ఎక్కడా రైతులలో ఆనందం కానరాలేదు సరికదా విమర్శలు వెల్లువెత్తాయి.  వాస్తవానికి ఈ బిల్లుల వల్ల ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రైతు ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతుందన్నది వ్యవసాయ రంగ నిపుణుల అనుభవం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు మాత్రమే దోహదపడడతాయన్నది వారి విశ్లేషణ్. సామాన్య రైతు తను పండించిన పంటను మద్దతు ధర వచ్చే వరకూ అమ్మకుండా నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండదు...అందుకే బడా వ్యాపారులకో, బడా భూస్వామికో అయిన కాడికి అమ్మేసుకునే అనివార్య పరిస్థితులకు నెట్టబడతాడు. ధరను డిమాండ్ చేయలేని దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటాడు. దీని వల్ల వాస్తవంగా లాభపడేది కామందులనబడే భూస్వాములు, లేదా పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు మాత్రమే.

ఇక రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్కెట్ యార్డుల ద్వారా వచ్చే సెస్ రాదు. ఆ మేరకు ఆదాయాన్ని అవి కోల్పోతాయి. రైతుకు సరైన ధర రానప్పుడు ప్రభుత్వాలు ముందుకు వచ్చి కనీస మద్దతు ధర ఇచచి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. దాంతో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఇక వినియోగదారుడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే అది కూడా ఉండదు. కృత్రిమ కొరత సృష్టించి బడా వ్యాపార వేత్తలు రైతుల నుంచి చౌకగా కొన్న ఉత్పత్తులను వినియోగదారుడికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అంటే కేంద్రం తీసుకువచ్చిన అగ్రో బిల్లులు అంతిమంగా ఉపయోగపడేది సంపన్నులకే కానీ సామాన్యులకు ఎంత మాత్రం కాదు.  

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   40 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle