newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ్యక్తులపై దేశద్రోహం అతి పెద్ద ప్రమాదం.. స్టాలిన్ ధ్వజం

06-10-201906-10-2019 11:02:04 IST
Updated On 06-10-2019 11:03:43 ISTUpdated On 06-10-20192019-10-06T05:32:04.480Z06-10-2019 2019-10-06T05:32:01.216Z - 2019-10-06T05:33:43.728Z - 06-10-2019

వ్యక్తులపై దేశద్రోహం అతి పెద్ద ప్రమాదం.. స్టాలిన్ ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం, ప్రముఖ నటి రేవతి, ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ తదితర ప్రముఖులపై దేశద్రోహ ఆరోపణలతో ఎప్ఐఆర్ నమోదు చేయడాన్ని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్  తీవ్రంగా ఖండించారు. దేశంలో మతపరమైన హింసాత్మక ఘటనలు పెరిగిపోతుండటంపై విచారం వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులు ప్రధాని నరేంద్రమోదీకి ఉత్తరం రాసిన నేపధ్యంలో వారిపై పోలీసులు దేశద్రోహ నేరం మోపిన విషయం తెలిసిందే.

మణిరత్నం, రేవతి, రామచంద్రగుహ వంటి ప్రముఖ వ్యక్తులను దేశద్రోహులుగా ఆరోపించడమే మన ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదమని స్టాలిన్ ప్రకటన వెలువరించారు. నిరంకుశాధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవారు ప్రజాస్వామ్యం ముందు ఓడిపోయారని చరిత్ర సాక్షీభూతంగా నిలిచిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛపై చర్యలు తీసుకుంటుండటాన్ని ఏ రకంగానూ ఆమోదించలేమని డీఎంకే అధినేత పేర్కొన్నారు. 

జూలై నెలలో ప్రధాని నరేంద్రమోదీకి 49మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉత్తరం రాసిన విషయం తెలిసిందే. బీహార్‌లోని ముజఫరాబాద్ లోని సదర్ పోలీస్ స్టేఎషన్ వీరిపై ఎఫ్ఐఆర్‌ని నిర్ధారించింది. అడ్వకేట్ సుధీర్ ఓజా దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తివారీ ఆమోదించి తదుపరి చర్యకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ 49మంది ప్రముఖులూ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పాలన తీరును కించపరుస్తోందని, పైగా వేర్పాటు వాద ధోరణులను వారి ఉత్తరం సమర్థిస్తోందని అడ్వకేట్ సుధీర్ ఓజా ఆరోపించారు. వీరిపై దాఖలైన కేసును తక్షణం ఉపసంహరించడానికి ప్రధాని చర్యలు చేపట్టాలని స్టాలిన్ కోరారు.

విమర్శించినంత మాత్రానే జాతి వ్యతిరేక చర్య అని అనుకోరాదని ఆ 49 మంది ప్రముఖులూ తాము ప్రధానికి రాసిన ఉత్తరంలోనే పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలను, అసమ్మతిని అణిచివేయని వాతావరణం దేశానికి అవసరమని, అదే దేశాన్ని శక్తిమంతంగా మలుస్తుందని వారు పేర్కొన్నారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   10 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   37 minutes ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   3 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   18 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   a day ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle