newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

వోరా త‌ప్ప వేరే వారు లేరా..?

04-07-201904-07-2019 07:52:47 IST
Updated On 05-07-2019 16:13:58 ISTUpdated On 05-07-20192019-07-04T02:22:47.113Z04-07-2019 2019-07-04T02:21:49.220Z - 2019-07-05T10:43:58.519Z - 05-07-2019

వోరా త‌ప్ప వేరే వారు లేరా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

130 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. ఓ వైపు వ‌రుస‌గా రెండుసార్లు దారుణ ఓట‌మి చ‌విచూసిన ఆ పార్టీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఏకంగా కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ గాంధీ రాజీనామా చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. ఇంత‌కాలం త‌మ నాయ‌కుడు రాహుల్ గాంధీ తిరిగి పార్టీ ప‌గ్గాలు తీసుకుంటార‌ని ఆశించిన కాంగ్రెస్ శ్రేణుల‌కు రాహుల్ షాక్ ఇచ్చారు. 

తాను అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్నానని, కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించాల‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయ‌న స్థానంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్య‌క్షుడిగా 90 ఏళ్ల మోతీలాల్ వోరారు నియ‌మించారు. 47 ఏళ్ల యువ‌నేత‌, గాంధీ కుటుంబ వార‌స‌త్వం ఉన్న రాహుల్ గాంధీతోనే కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్ట‌డం సాధ్యం కాక‌పోతే 90 ఏళ్ల వృద్ధ నేత ఎలా ఈ ప‌ద‌విని నిర్వ‌ర్తిస్తార‌నేది ఇప్పుడు కాంగ్రెస్ కార్య‌క‌ర్త నుంచి అగ్ర నాయ‌కుడి వ‌ర‌కు వేధిస్తున్న ప్ర‌శ్న.

కాంగ్రెస్ పార్టీకి అత్యంత నిబ‌ద్ధ‌త కలిగిన నేత‌గా మోతీలాల్ వోరాకు పేరుంది. ముఖ్యంగా గాంధీ కుటుంబానికి మోతీలాల్ వోరా అత్యంత న‌మ్మ‌క‌స్థుడు. ప్ర‌స్తుతం ఆయ‌న అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీకి కోశాధికారిగా ప‌నిచేస్తున్నారు. స‌మాజ్‌వాదీ పార్టీలో రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన వోరా త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర‌, కేంద్ర మంత్రిగా, ఉత్త‌ర ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. 

మొద‌ట ఇందిరా గాంధీకి, త‌ర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా మోతీలాల్ వోరాకు పేరుంది. అయితే, ఆయ‌న దేశ‌మంతా తెలిసిన వ్య‌క్తి కాదు. ఇప్ప‌టికే కాంగ్రెస్‌కు యువ ఓట‌ర్లు దూరం కావ‌డ‌మే ప్ర‌ధాన మైన‌స్‌గా ఉంది. ఇప్పుడు వృద్ధ నేత‌ను తీసుకువ‌చ్చి కాంగ్రెస్ అధ్య‌క్ష పీఠంపై కూర్చోబెడితే పార్టీ భ‌విష్య‌త్ ఏంట‌నేది స‌గ‌టు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌కు అంతుచిక్క‌డం లేదు.

అయితే, తాత్కాలిక అధ్య‌క్షుడిగానే మోతీలాల్ వోరా ఉంటార‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ క్లారిటీ ఇచ్చింది. కానీ, కొత్త అధ్య‌క్షుడిని ఎంచుకోవ‌డం కాంగ్రెస్‌కు మ‌రింత క్లిష్ట‌మైన స‌మ‌స్య‌. దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేత‌లు ఆ పార్టీలో క‌రువ‌య్యారు. ముఖ్యంగా అశోక్ గెహ్లాట్ పేరు ఈ ప‌ద‌వి కోసం ప్ర‌ధానంగా వినిపిస్తోంది. 

ఆయ‌న కూడా వృద్ధుడే. ఆయ‌న‌ను రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా పార్టీ ఎంపిక చేయ‌డ‌మే ఇటీవ‌ల పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం. ఇప్పుడు ఆయ‌న‌ను ఏకంగా జాతీయ కాంగ్రెస్ అధ్య‌క్షుడిని చేసే సాహ‌సం కాంగ్రెస్ చేయ‌బోద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. 

ఇక‌, మ‌రో యువ‌నేత స‌చిన్ పైల‌ట్ పేరు కూడా ఈ ప‌ద‌వికి వినిపిస్తోంది. ఆయ‌న రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం వెనుక కీల‌క నేత‌. స‌మ‌ర్థుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆయ‌నను కాంగ్రెస్ అధ్య‌క్షుడిని చేస్తే రాహుల్ గాంధీకి పోటీగా ఎదిగే ప్ర‌మాదం కూడా ఉంది. 

కాబ‌ట్టి, ఆయ‌న‌ను కూడా ఈ ప‌ద‌వికి ఎంపిక చేయ‌క‌పోవ‌చ్చు. గాంధీ కుటుంబానికి న‌మ్మ‌కంగా ఉండే వారిని ఈ ప‌ద‌విలో నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్ప‌ట్లో ఈ వ్య‌వ‌హారం తేలే అవ‌కాశం లేదు. మోతీలాల్ వోరానే చాలాకాలం ఈ ప‌ద‌విలో కొన‌సాగే అవ‌కాశం ఉంది.0


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle