newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

"వోకల్ ఫర్ లోకల్" ఉద్యమానికి మోడీయే బ్రాండ్ అంబాసిడరా?

31-08-202031-08-2020 08:25:09 IST
Updated On 31-08-2020 09:38:40 ISTUpdated On 31-08-20202020-08-31T02:55:09.977Z31-08-2020 2020-08-31T02:55:03.004Z - 2020-08-31T04:08:40.215Z - 31-08-2020

"వోకల్ ఫర్ లోకల్" ఉద్యమానికి మోడీయే బ్రాండ్ అంబాసిడరా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నరేంద్ర మోడీ ఏ విషయం గురించి ప్రచారం చేసినా దానికి మంచి గుర్తింపు లభిస్తుంది. తాజాగా మన ప్రధాని వోకల్ ఫర్ లోకల్ అంటూ కొత్త నినాదం తెరమీదకు తెచ్చారు. స్వదేశీ ఉద్యమం అని గతంలో అందరినోట నానింది. కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న వేళ మోడీ వోకల్ ఫర్ లోకల్ అంటూ మేకిన్ ఇండియా వస్తువుల్ని వాడాలంటూ పిలుపునిస్తున్నారు. తాజాగా జరిగిన మన్ కీ బాత్ లోనూ ఇదే మాట బయటపెట్టారు.

దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్‌లనే వాడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. ఆదివారం మనకీ బాత్‌ కార్యక్రమంలో ఆయన ఇదే విషయం ప్రస్తావించారు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని వారి కర్తవ్యాన్ని కొనియాడారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని చెప్పారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను ప్రపంచస్థాయిలో తయారు చేయాలని, స్థానిక కళలు, కళాకారులను ప్రోత్సహించాలన్నారు.

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా స్వదేశీ ఉత్పత్తుల గురించి పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని మోడీ అన్నారు. ఇలా గనుక అనకపోతే... మన దేశీయ వస్తువులకు డిమాండ్ ఉండదని ప్రధాని అన్నారు. దేశీయ ఉత్పత్తుల తయారీదారులకు మనము ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. భారతదేశం ఎన్ని సంవత్సరాలు ముడి సరుకులను ప్రపంచానికి ఎగుమతి చేస్తుందని, భారత్ ఇప్పుడు ప్రపంచానికి మంచి ఉత్పత్తులను మనమే అందించాలన్నారు.

తాజాగా మన్ కీ బాత్ లో ఏపీలోని ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల గురించి ప్రచారం చేశారు. మనదేశంలో ఎంతో ప్రతిభావంతులైన చేతివృత్యుల కళాకారులు వున్నారన్నారు.  స్థానిక కళలను, కళాకారులను ప్రోత్సహించాలని తెలిపారు. చిన్న పిల్లలు ఆదుకునే వస్తువులను ప్రపంచస్థాయిలో తయారు చేయాలని సూచించారు. స్వదేశీ కంప్యూటర్ గేమ్స్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త ఆన్‌లైన్ గేమింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని దేశ యువతకు పిలుపునిచ్చారు.  దేశీ యాప్ ల ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి. కులవృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మల గురించి మోడీ ప్రస్తావించారు. ఏటికొప్పాక కళాకారుడు సీవీ రాజు గొప్పదనం తో సహా, కృష్ణాజిల్లా లోని కొండపల్లి బొమ్మల గురించి ప్రస్తావించారు. కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణ, ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లి, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని డుబ్రి, ఉత్తర ప్రదేశ్‌లోని వారణాశి లో తయారయ్యే బొమ్మలు ప్రపంచదేశాలను ఆకట్టుకుంటున్నాయన్నారు. 

మన్ కీ బాత్ లో భాగంగా గత నెలలో కార్గిల్‌ యుద్ధవీరుల ధైర్య సాహసాలను మోడీ స్మరించుకున్నారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి ధైర్య సాహసాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని తెలిపారు. కార్గిల్‌ యుద్ధంలో సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే విజయ్‌ దివస్‌ జూలై 26 కావడంతో ప్రధాని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1999లో ఇదే రోజు కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ విజయం సాధించింది. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ఆయనే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ లా మారారు. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle