వైసీపీ ఎంపీలకు పార్లమెంటరీ కమిటీల్లో పెద్దపీట
21-11-201921-11-2019 13:10:36 IST
2019-11-21T07:40:36.552Z21-11-2019 2019-11-21T07:40:32.353Z - - 23-04-2021

2019 ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది వైసీపీ. ఏపీలో 25 లోక్ సభ సీట్లకు గాను 22 సీట్లు సాధించింది. టీడీపీకి విజయవాడ,గుంటూరు, శ్రీకాకుళం ఎంపీ సీట్లు మాత్రమే దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖలకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలను పార్లమెంటరీ సలహా సంఘం సభ్యులుగా నియమించారు. ఈ కమిటీల్లో వైసీపీ ఎంపీలకు పెద్ద పీట లభించింది. వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పరిశీలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంపీలందరికీ ప్రాతినిధ్యం లభించింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ - మిథున్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ -మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - వల్లభనేని బాలశౌరి, ఆరోగ్యశాఖ - వంగా గీత, పశు సంవర్థక, మత్స్యశాఖ - శ్రీ కృష్ణ దేవరాయలు, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ - వైఎస్ అవినాష్ రెడ్డి, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ - జి మాధవి, విద్యుత్ శాఖ - రఘురామకృష్ణంరాజు, జలశక్తి శాఖ - బ్రహ్మానందరెడ్డిలను సభ్యులుగా నియమించారు. అలాగే గృహ పట్టణ వ్యవహారాల శాఖ- ఎంవీవీ సత్యనారాయణ, అడవులు పర్యావరణం - కోటగిరి శ్రీధర్, వ్యవసాయ రైతు సంక్షేమం - బెల్లాన చంద్రశేఖర్, భారీ పరిశ్రమలు , ప్రభుత్వ రంగ సంస్థలు - మార్గాని భరత్, రవాణా జాతీయ రహదారులు -డాక్టర్ సంజీవ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ -చింతా అనురాధ, పర్యాటక సాంస్కృతిక శాఖ - రెడ్డప్ప, హోం శాఖ - గోరంట్ల మాధవ్, ఉక్కు శాఖ -నందిగామ సురేష్, షిప్పింగ్ - తలారి రంగయ్య, విదేశాంగ శాఖ - సత్యవతి, రైల్వే శాఖ - ఆదాల ప్రభాకర్ రెడ్డి. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - విజయసాయిరెడ్డి, విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరులు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పదవులు లభించాయి.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
3 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
an hour ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
4 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
6 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా