newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వైరల్ అవుతున్న అభిగ్య జ్యోతిష్యం.. అతనేం చెప్పాడు?

01-04-202001-04-2020 09:04:27 IST
Updated On 01-04-2020 09:39:12 ISTUpdated On 01-04-20202020-04-01T03:34:27.348Z01-04-2020 2020-04-01T03:34:19.596Z - 2020-04-01T04:09:12.161Z - 01-04-2020

వైరల్ అవుతున్న అభిగ్య జ్యోతిష్యం.. అతనేం చెప్పాడు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ్యోతిష్యం అంటే చాలామంది నమ్ముతారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక్క పేరు అభిగ్య. ఏడు నెలల క్రితం అతను చెప్పిన జ్యోతిష్యం అక్షరాలా ఫలించడంతో అతనిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అతను చెప్పేది నిజమేనా, జ్యోతిషంలో అతనికి అంత పాండిత్యముందా అని నన్ను అందరూ అడగడంవల్ల ఈ పోస్టు పెడుతున్నా. అభిగ్య ఆనంద్ వీడియోలు నాకు అనిపించింది ఏమిటంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటే ఇదేనని. 

పదేళ్ల ప్రాయంలోనే భగవద్గీతలోని 700 శ్లోకాలను అనర్ఘళంగా వల్లెవేయడం, జ్యోతిషం, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెప్పడం మామూలు విషయం కాదు. ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అతనిది మైసూర్. తండ్రి పేరు ఆనంద్ రామసుబ్రమణియన్, తల్లి అన్నుఆనంద్. అతి చిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన పట్టడం అభిగ్య ఆనంద్ ప్రత్యేకత. ఇప్పుడతని వయసు 14 ఏళ్లు. గుజరాత్ లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేదవిశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఇంత చిన్నవయసులో నియమితుడవడం మామూలు విషయం కాదు. 

అతని సోదరి అభిదేయకు కూడా ఇలాంటి ప్రతిభాపాటవాలు ఉన్నాయి. అతి చిన్న వయసులో గ్లోబల్ చైల్ పాడిజీ అవార్డును అందుకున్నాడు. ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పీహెచ్ డీ చేశాడు. జ్యోతిషంలోని వివిధ విధానాల మీద అనేక పరిశోధనలు చేశాడు. వాస్తు లోనూ నైపుణ్యం సాధించాడు. విశ్వమ్ వాస్తుమయం అనే పోర్టల్ కూడా నిర్వహిస్తున్నాడు.

అతను చెప్పిందేంటి?

గ్రహస్థితిగతులను అనుసరించి ముప్పు ముంచుకొస్తోందని అతను ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబరు నుంచి 2020 మే వరకూ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పాడు.  దీనిపై 7 నెలల క్రితమే అతను చేసిన వీడియో కూడా చేశాడు. వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని కూడా అతను ప్రకటించాడు. చైనా యుద్ద సమస్యను ఎదుర్కొంటుందని అతను ప్రకటించాడు. 

ధనిక దేశాలన్నీ అతలాకుతలం అవుతాయని చెప్పాడు. ముఖ్యంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రకటించాడు. అతని జ్యోతిష విధానం చాలా లాజికల్ గా ఉంది. కొందరు జ్యోతిష పండితులు అతన్ని ఇంటర్వ్యూ చేసినపుడు అతను చెప్పిన సమాధానాలు చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న వయసులో ఈ శాస్ర్తం మీద ఇలా  ఎలా చెప్పగలుగుతున్నాడని అనిపించింది. ముఖ్యంగా ప్రశ్నశాస్ర్తం మీద కూడా అతనికి మంచి పట్టుంది. అతను చేసిన వీడియోల లింక్ పెడుతున్నాను చూడండి.

అలాగే ఫైనాన్షియల్ అస్ట్రాలజీలోనూ అతను దిట్ట. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని  కూడా అతను చక్కటి విశ్లేషణ చేశాడు. గత జన్మలను నమ్మనివారు కూడా అతని వీడియోలు చూస్తే తమ అభిప్రాయాలను మార్చుకుంటారేమో. ఇక ఇప్పుడున్న పరిస్థితుల గురించి అతను  చాలావరకు చెప్పాడు. కరోనా గురించి అతను చెప్పిందాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   14 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle