వెనక్కి తగ్గం.. ముందడుగే మా ఎజెండా
02-03-202002-03-2020 09:48:17 IST
Updated On 02-03-2020 13:23:37 ISTUpdated On 02-03-20202020-03-02T04:18:17.338Z02-03-2020 2020-03-02T04:17:59.116Z - 2020-03-02T07:53:37.083Z - 02-03-2020

పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలు దేశవ్యాప్తంగా రచ్చరేపుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ఇప్పుడిప్పుడే ప్రశాంతత నెలకొంటోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నా మూడు రోజులుగా పరిస్థితులు అదుపులో వున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ పరిస్థితులపై వచ్చే వదంతులను పట్టించుకోవద్దని, అటువంటి వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులను పోలీసులు కోరారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఆదివారం అల్లర్ల ప్రభావిత బ్రహ్మపురిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఢిల్లీ ఘర్షణలకు సంబంధించి 903 మందిని అదుపులోకి తీసుకున్నారు. 254 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడించాలని హక్కుల కార్యకర్తలు పోలీసులను కోరారు. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టంపై తన వైఖరి మరోమారు తన వైఖరి వెల్లడించారు హోంమంత్రి అమిత్ షా. బెంగాల్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదరికం నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రానున్న ఎన్నికల్లో తమదే ఘన విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారంనాడు కోల్ కతా సీఏఏ అనుకూల సభలో ఆయన విపక్షాల తీరుని ఎండగట్టారు. సీఏఏ ప్రకారం దేశంలో ఉన్న శరణార్ధులందరికీ పౌరసత్వం కల్పిస్తామని అమిత్ షా పునరుద్ఘాటించారు.ఎవరి పౌరసత్వానికి భంగం కలగదన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సీఏఏపై అసత్య ప్రచారాన్ని చేస్తూ.. మైనారిటీలు, శరణార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వం కోసం శరణార్థులు పత్రాలు చూపించాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు. దమ్ముంటే పౌరసత్వ చట్ట అమలును ఆపాలని మమతకు సవాల్ విసిరారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తుంటే మమత సహా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అమిత్ షా సభ సందర్భంగా కూడా ‘గోలీ మారో’ నినాదాలు గట్టిగా వినిపించాయి. ఈ సభా స్థలికి వెళుతున్న కొందరు బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని ఈ నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే... ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇంటిలిజెన్స్ అధికారి అంకిత్ శర్మ మృత దేహం డ్రైనేజీ లో దారుణ పరిస్థితుల్లో లభ్యమవడంతో యావద్దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ షాక్ నుంచి తేరుకోక మునుపే ఆదివారంనాడు గోకల్‌పురిలోని తూర్పు యమునా కాలువ నుంచి గుర్తు తెలియని రెండు మృతదేహాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకోవడం మరింత సంచలనమవుతోంది. అయితే ఈ మృత దేహాలు ఇటీవల జరిగిన అల్లర్లకు సంబంధించినవేనా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ అల్లర్ల నేపద్యంలో అంకిత్ శర్మ హత్యకు గురవడం, పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మరణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అంకిత్ శర్మ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు సైతం హత్య జరిగిన తీరు పట్ల తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లు, హింస వ్యవహారంలో ఇప్పటి వరకూ 45 మంది మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో షహీన్‌బాగ్‌లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. 144 సెక్షన్ అమలులో వుంది. ఆదివారం ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
6 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
9 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
13 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా