newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి... నిలకడగానే ప్రణబ్ ఆరోగ్యం

11-08-202011-08-2020 19:07:59 IST
2020-08-11T13:37:59.354Z11-08-2020 2020-08-11T13:36:12.990Z - - 14-04-2021

వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి... నిలకడగానే ప్రణబ్ ఆరోగ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్‌ చేసి దాన్ని తొలగించారు. అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్‌ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. గత వారంలో తనను సంప్రదించిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం లేదా కోవిడ్‌–19 పరీక్షలు చేయించుకోవడమో చేయాలని, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కూడా అయిన ఆయన విజ్ఞప్తి చేశారు. 

‘ప్రణబ్‌కు బ్రెయిన్‌ క్లాట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స చేశామని ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా వున్నా వెంటిలేటర్‌పై ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపాయి.  ఆయనకు ఇప్పుడు 84 ఏళ్ళు. 2012–17 మధ్యకాలంలో ప్రణబ్‌ రాష్ట్రపతిగా పనిచేశారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆర్‌ఆర్‌ ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఆయన కూతురు షర్మిష్టకు ఫోన్‌ చేసి ప్రణబ్‌ ఆరోగ్యం గురించి వాకబు చేసినట్టు తెలుస్తోంది. అలాగే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, అశోక్‌ గహ్లోత్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంతి పీయూష్‌ గోయల్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, వైసీపీ నేతలు మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle