వుహాన్‌లో నో లాక్ డౌన్.. నో పరేషాన్
08-04-202008-04-2020 10:47:56 IST
Updated On 08-04-2020 12:52:28 ISTUpdated On 08-04-20202020-04-08T05:17:56.980Z08-04-2020 2020-04-08T05:17:49.808Z - 2020-04-08T07:22:28.102Z - 08-04-2020

ప్రపంచ వ్యాప్తంగా వుహాన్ పేరు చెబితే ఉలిక్కిపడతారు. ప్రాణాంతం వైరస్ కరోనాకు పుట్టినిల్లు. నిత్యం రద్దీగా వుండే ఈ నగరం కరోనా కారణంగా బోసిపోయింది. డిసెంబర్ నుంచి అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా మహమ్మారికి జన్మస్థానమైన చైనాలోని వుహాన్‌లో బుధవారం లాక్డౌన్ ఎత్తివేశారు. హుబె ప్రావిన్స్ రాజధాని నగరమైన వుహాన్‌లో 76 రోజుల పాటు విధించిన నిర్బంధాన్ని తొలగించారు. దీంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. 11 వారాల క్రితం వుహాన్ లో రాకపోకల్ని నిషేధించారు. పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలుచేశారు. అడపా దడపా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కొత్తగా కోవిడ్ కేసులు నమోదు కాకపోవడంతో నిర్బంధం తొలగించాలని అధికారులు నిర్ణయించడంతో ప్రజలకు స్వేచ్ఛ లభించింది. వుహాన్ వాసుల ప్రయాణాలకు అనుమతి లభించిందని అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. దాదాపు 55 వేల మంది బుధవారం రైళ్ల ద్వారా వుహాన్ నుంచి బయలు దేరుతున్నారు. కరోనా భయంతో 76 రోజుల తర్వాత దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. దీంతో వుహాన్ నగరంలో సందడి ఏర్పడింది. వుహాన్ నుంచి చైనాలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరిన జనంతో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. పాఠశాలలను మినహాయించి మిగతా అన్ని ఆంక్షలను తొలగించారు. తొలుత చైనాలో వుహాన్ లోనే కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో వివిధ వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 50వేలకు పైగా కరోనా కేసులు వుహాన్‌లో ఉన్నాయి. వుహాన్‌లోనే 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన చైనా పాలకులు జనవరి 23 నుంచి వుహాన్‌లో లాక్డౌన్ ప్రకటించారు. కఠిన ఆంక్షలు అమలు చేయడంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. ఇటు బ్రిటన్ లో పరిస్థితి ఆందోళనకరంగా వుంది. స్వయంగా ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారిన పడడంతో అక్కడేం జరుగుతుందో అర్థంకావడం లేదని బ్రిటన్ వాసులు చెబుతున్నారు. కరోనాతో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి నిలకడగా ఉంది. లండన్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ వాడడం లేదంటున్నారు. లండన్‌లో సెయింట్ థామస్ ఆస్పత్రిలో వైద్య నిపుణుల బృందం జాన్సన్‌కు చికిత్స అందిస్తున్నారని, జాన్సన్ చెప్పినట్టుగా ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని ఆయన వివరించారు. బోరిస్ జాన్సన్ త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆయన ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అమెరికాలో మృతుల సంఖ్య 11 వేలకు, వ్యాధిగ్రస్తుల సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. న్యూయార్క్‌లో అత్యధికంగా 5 వేల కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు అమెరికాలో 1900 మంది మరణించారు. జపాన్‌లో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ప్రధానమంత్రి షింజో అబె నెల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అన్నారు. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటలీ, స్పెయిన్లలో కోవిడ్ 19 కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. 24 గంటల్లో స్పెయిన్‌లో 743 మరణాలు నమోదైతే, ఫ్రాన్స్‌లో 833 మంది చనిపోయారు. ఇటు భారత్ లో 5000 కి పైగా కేసులు నమోదయ్యాయి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా