newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విస్తరిస్తున్న కరోనా వైరస్... ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల నిర్లక్ష్యం

06-03-202006-03-2020 11:13:29 IST
2020-03-06T05:43:29.400Z06-03-2020 2020-03-06T05:42:47.948Z - - 14-04-2021

విస్తరిస్తున్న కరోనా వైరస్... ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల నిర్లక్ష్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్‌తో ఇరాన్‌లో 107, ఇటలీలో 107 మంది మృతి చెందారు. ఈ వైరస్ తీవ్రంగా వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ అప్రమత్తత ప్రకటించింది. విదేశీయుల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నాయి వివిధ దేశాలు. విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు పెరిగాయి. పాఠశాలలు, ప్రార్థనాలయాలు మూతపడ్డాయి.

చైనాలో వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతోంటే, ఇటలీ, ఇరాన్‌ లాంటి ఇతర దేశాల్లో తీవ్రతరమౌతోంది. కరోనా కలకలం అంతర్జాతీయంగా దాదాపు 30 కోట్ల మంది విద్యార్థులను వారంపాటు విద్యాలయాలకు దూరం చేసింది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరడంతో ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసేశారు. ఇటలీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. విదేశీయులను కోవిడ్‌ సోకలేదని వైద్యుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని భారత్‌ కోరుతోంది.

దీంతో భారత్ కు విదేశీయల రాక తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 95,000 మంది ప్రజలకు వైరస్‌ సోకగా, 3,200 మంది మరణించారు. ఢిల్లీలోని  మొగల్‌ గార్డెన్‌లోకి ప్రజల సందర్శనలను  నిలిపి వేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది.  ఫ్లూతో బాధపడే ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశం ఇవ్వనుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో 16 ఏళ్ల భారతీయ బాలికకు కోవిడ్‌ సోకినట్టు  తేలింది. కరోనా ఎఫెక్ట్  కారణంగా వివిధ అంతర్జాతీయ సమావేశాలు కూడా వాయిదా పడుతున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగాల్సిన సదస్సు వాయిదా పడినట్లు భారత్‌ తెలిపింది. ఈ నెల 13న ఈ సమావేశం కోవిడ్‌ కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది.

ఒకవైపు కరోనా వైరస్ కలకలం రేపుతుంటే.... ప్రభుత్వ వైద్యులు మాత్రం పట్టించుకోవడం లేదు. కృష్ణా జిల్లాలో కోవిడ్ 19 భయం వెంటాడుతోంది. ఓ రోగికి కోవిడ్ 19 వైరస్ సోకినట్టు అనుమానం వ్యక్తం అయింది.  కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ రామన్ తీరు విస్మయం కలిగించింది. 

10 రోజుల క్రితమే ఇటలీ నుంచి జగ్గయ్యపేటకు వచ్చిన ఒక యువతి తీవ్రమయిన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ రామన్ ను కలిసిన యువతి తండ్రి పరిస్థితిని వివరించారు. ఐసోలేషన్ వార్డ్ కోసం ఆరా తీశారు యువతి తండ్రి. తన కుమార్తె పరిస్థితి వివరించారు యువతి తండ్రి. అయితే ఇక్కడ ప్రత్యేక వార్డు లేదు విజయవాడ తీసుకెళ్లాలి అని సూచించారు వైద్యులు. దీంతో ఏమి చేయాలో అర్థంకాక కొద్దిసేపు ఆసుపత్రిలో కూర్చుని వెళ్లిపోయారు తండ్రి. విషయం బయటకు పొక్కడంతో జగ్గయ్యపేటలో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రిలోని రోగులు తీవ్రమయిన భయాందోళనకు గురవుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle