newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విస్తరణ వాదానికి కాలం చెల్లింది.. సైనికులకు స్ఫూర్తి కలిగించిన మోదీ పర్యటన

04-07-202004-07-2020 07:28:05 IST
Updated On 04-07-2020 10:34:03 ISTUpdated On 04-07-20202020-07-04T01:58:05.323Z04-07-2020 2020-07-04T01:58:01.904Z - 2020-07-04T05:04:03.720Z - 04-07-2020

విస్తరణ వాదానికి కాలం చెల్లింది.. సైనికులకు స్ఫూర్తి కలిగించిన మోదీ పర్యటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా విషయంలో మెతకగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి శుక్రవారం ఆకస్మికంగా లద్దాఖ్‌లోని లేహ్‌ జిల్లాలో ఉన్న నీమూ ప్రాంతానికి వెళ్లి డ్రాగన్‌ దేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారతదేశం చేతులు ముడుచుకుని కూర్చోదని సంకేతాలు పంపడమే కాక, సైన్యం మనోబలాన్ని పెంచుతూ వ్యాఖ్యలు చేశారు. ‘శాంతి, స్నేహం భారతదేశ సంస్కృతి. కానీ, మా శాంతికాముకత్వాన్ని బలహీనతగా భావించవద్దు’’ అని డ్రాగన్‌ దేశాన్ని హెచ్చరించారు. సరిహద్దుల్లో మన సైనికుల ఆగ్రహావేశాలను శత్రువులు చవిచూశారని.. మన జవాన్ల ధైర్యసాహసాల గాథలు దేశంలోని ప్రతి ఇంట్లో ప్రతిధ్వనిస్తున్నాయని కొనియాడారు. 

తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనాతో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ప్రధాని మోదీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ సందర్భంగా ‘నిము’లో ఉన్న ఫార్వర్డ్‌ పోస్ట్‌ వద్ద భారతీయ సైనిక, వైమానిక, ఐటీబీపీ దళాలనుద్దేశించి దాదాపు అరగంట పాటు ఉద్వేగపూరితంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. గల్వాన్‌ లోయలో చైనాతో ఘర్షణల్లో అసువులు బాసిన అమర జవాన్లకు మరోసారి ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాన్ని దేశం తరతరాలు గుర్తు పెట్టుకుంటుందని శ్లాఘించారు. భరతమాత శత్రువుకు భారతీయుల ఆగ్రహావేశాలను రుచి చూపించారని ‘14 కార్ఫ్స్‌’ సైనికులపై ప్రశంసలు గుప్పించారు. 

గల్వాన్‌ ఘర్షణల్లో గాయపడి, ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధాని పరామర్శించారు. శత్రువుకు సరైన గుణపాఠం చెప్పారని వారిని ప్రశంసించారు. వారి ధైర్యసాహసాలను, వారు చిందించిన రక్తాన్ని దేశం మర్చిపోదన్నారు. గల్వాన్‌లో భారతీయ జవాన్లు చూపిన సాహసం గురించి ప్రపంచం మాట్లాడుకుంటోందన్నారు. వారి గురించి, వారికి అందించిన శిక్షణ గురించి, వారి నిబద్ధత గురించి తెలుసుకోవాలనుకుంటోందన్నారు. ‘మీ ధైర్య సాహసాలు భారతదేశ యువతకు స్ఫూర్తినిస్తున్నాయి’ అన్నారు.  

‘పిరికివారు, బలహీనులు శాంతిని సాధించలేరు.  శాంతి నెలకొనేందుకు ముందుగా ధైర్యసాహసాలు అత్యంతావశ్యకం’ అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఆ ధైర్య సాహసాలు భారత జవాన్ల వద్ద పుష్కలంగా ఉన్నాయన్నారు. భారత సాయుధ దళాల శక్తి, సామర్థ్యాలను ప్రపంచం గమనించిందని, గల్వాన్‌ లోయ ఘటనను పరోక్షంగా ప్రస్తావించారు. ‘మీ ధైర్య సాహసాలు మీరు గస్తీ కాస్తున్న ఈ పర్వతాల కన్నా సమున్నతమైనవి. దేశ రక్షణ మీ చేతుల్లో భద్రంగా ఉందన్న భరోసా నాకే కాదు.. దేశ ప్రజలందరిలోనూ ఉంది. మీరంతా మాకు గర్వకారణం’ అని కొనియాడారు. ‘లేహ్, లద్దాఖ్, కార్గిల్, సియాచిన్‌.. ఈ సరిహద్దుల్లోని ఎత్తైన మంచు పర్వతాలు, ఇక్కడి నదుల్లో ప్రవహించే చల్లని నీరు భారతీయ జవాన్ల వీరత్వానికి మౌన ప్రేక్షకులుగా నిలుస్తాయ’ని అభివర్ణించారు.

విస్తరణ వాదానికి కాలం చెల్లిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన చైనాకు స్పష్టమైన సందేశమిచ్చారు. ఇది ప్రగతి వాద యుగమని అర్థం చేసుకోవాలన్నారు. ప్రపంచమంతా అభివృద్ధి వైపే పయనిస్తోందన్నారు. విస్తరణ కాంక్షతో ఉన్న శక్తులు పరాజయం పాలవడమో, పలాయనం చిత్తగించడమో జరిగిందని చరిత్ర చెబుతోందన్నారు. సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరించారు. చైనాతో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలను కొనియాడుతూ.. సరిహద్దుల్లోని వీర జవాన్ల ధైర్య సాహసాలను ఇప్పుడు దేశమంతా ఘనంగా చెప్పుకుంటోందంటూ ఆ బ్రేవ్‌ హార్ట్స్‌కు సెల్యూట్‌ చేశారు.

ప్రపంచ యుద్ధాల సమయంలో కానీ, శాంతి సమయంలో కానీ.. మీ సేవలను ప్రపంచం ఏనాడో గుర్తించింద’ని భారత సైనికులను ప్రధాని ప్రశంసించారు. ‘వేణువూదే కృష్ణుడినే కాదు.. శత్రువుపై సుదర్శన చక్రం ప్రయోగించే కృష్ణుడినీ మనం పూజిస్తామ’న్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, స్నేహం, ధైర్యం.. శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో భాగమైన విధానాన్ని ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. ప్రగతిదాయక శాంతియుత భారతదేశాన్ని కకావికలు చేసే అన్ని కుయత్నాలను విజయవంతంగా అడ్డుకుని, తగిన గుణపాఠం చెప్పిన చరిత్ర భారత్‌కు ఉందన్నారు.

‘అందరితో శాంతిపూర్వక స్నేహ సంబంధాలనే భారత్‌ కోరుకుంటుంది. అలా అని, అది భారతదేశ బలహీనతగా భావించవద్దు’ అని హెచ్చరించారు. సాయుధ దళాల అవసరాలకు తన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన కోసం గతంలో కన్నా మూడురెట్లు ఎక్కువగా నిధులను కేటాయించామన్నారు. సాయుధ దళాల సహకారంతోనే స్వావలంబ భారత్‌ లక్ష్యం సాకారమవుతుందన్నారు. ‘మన శక్తిసామర్థ్యాలు, దేశ రక్షణ కోసం మనం చేసే ప్రతిజ్ఞ.. హిమాలయాలంత సమున్నతమైనవి’ అన్నారు.

గత ఏడు వారాలుగా భారత, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంట తీవ్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణలో కల్నల్‌ సహా 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   12 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   15 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle