newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విశ్వాసపరీక్షలో ఉద్దవ్ థాక్రే విజయం

30-11-201930-11-2019 15:24:10 IST
Updated On 30-11-2019 15:28:17 ISTUpdated On 30-11-20192019-11-30T09:54:10.783Z30-11-2019 2019-11-30T09:54:06.418Z - 2019-11-30T09:58:17.582Z - 30-11-2019

విశ్వాసపరీక్షలో ఉద్దవ్ థాక్రే విజయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే విశ్వాసపరీక్ష సందర్భంగా అనూహ్య పరిణామాలు సంభవించాయి. సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. విపక్షం లేకుండానే విశ్వాస పరీక్ష ముగిసింది. ఉద్దవ్ థాక్రేకు మొత్తం 169 మంది సభ్యుల మద్దతు లభించింది. 

దీంతో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. మరో మూడురోజులు డెడ్ లైన్ ఉన్నా ముందే విశ్వాసం చూరగొన్నారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఉద్దవ్ థాక్రే శుక్రవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ-కాంగ్రెస్ శివసేనలు పూర్తి మద్దతు ప్రకటించడంతో విశ్వాస పరీక్ష సునాయాసంగా ముగిసింది.

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 56 మంది, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు దక్కాయి. బలనిరూపణకు కావల్సిన సభ్యులు 145 అయితే ఉద్దవ్ థాక్రేకి 169 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో మహారాష్ట్రలో ఏర్పడిన ప్రతిష్టంభన ఇవాళ్టితో తొలగిపోయింది.

విశ్వాస పరీక్షకు ముందు ఎన్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బీజేపీ నేతలతో భేటీ అయినట్టు వచ్చిన వార్తలు ఉత్కంఠను రేపాయి. ఇవాళ ఉదయం బీజేపీ ఎంపీ ప్రతాపరావు చిఖాలికర్ ను అజిత్ కలిశారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ అని అజిత్ అనుచరులు పేర్కొన్నారు. పార్టీలు వేరైనా తమ మధ్య ఏనాటినుంచో అనుబంధం ఉందని అంటున్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విశ్వాసపరీక్షపై ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి 170 మంది సభ్యుల మద్దతు ఉందని పేర్కొనగా.. విశ్వాస పరీక్ష అనంతరం 169 మంది సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు.  

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   28 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle